వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హవాలా దివాలా?: మోడీ దెబ్బకు పాక్‌లో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ విదేశాల్లో నగదు బదలీకి నిన్న మొన్నటి వరకు పెద్ద సాధనంగా ఉపయోగపడిన హవాలా రాకెట్ ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క మాస్టర్ స్ట్రోక్‌తో కుదేలయింది. ముంబైలో పెద్ద పెద్ద హవాలా రాకెటర్లు చాలామంది పనిలేక గోళ్లు గిల్లుకోవాల్సి వస్తోంది.

రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడం, ఇంకా మార్కెట్లోకి పూర్తిస్థాయిలో కొత్త నోట్లు రాకపోవడంత అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో హవాలా వ్యాపారులు ఉన్నారంటున్నారు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు ఉంటుందో కూడా చెప్పలేకపోతున్నారు.

పెద్ద నోట్ల రద్దు: దావూద్‌కు బిగ్ షాక్, రూ.100పై కన్ను, కానీ..పెద్ద నోట్ల రద్దు: దావూద్‌కు బిగ్ షాక్, రూ.100పై కన్ను, కానీ..

ఎవరికి వారు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకొని కొత్త నోట్లను కాపాడుకుంటుండటంతో మార్కెట్లోకి కొత్త కరెన్సీ రావడం లేదు. కనీసం మరో వారం రోజుల పాటు హవాలా నడిచే పరిస్థితి లేదని అంటున్నారు. బుధవారం నాడు ముంబైలో ఒక హవాలా ఆపరేటర్ దాదాపు రూ.500 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లను కాల్చేశాడని, ఇదంతా వేర్వేరు వ్యక్తులకు ఇవ్వాల్సిన మొత్తమని అంటున్నారు.

fake currency

ఫేక్ కరెన్సీ పరిశ్రమ డెడ్

రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఇప్పుడు ఫేక్ కరెన్సీ పరిశ్రమ కూడా చచ్చింది. మోడీ ఒక్క దెబ్బతో ఫేక్ కరెన్సీ పరిశ్రమకు దారుణ నష్టం సంభవించింది. పాకిస్తాన్ నుంచి పెద్ద మొత్తంలో ఫేక్ కరెన్సీ మన దేశానికి వచ్చి పడుతోంది.

పెద్ద నోట్లు రద్దు కావడంతో ఇప్పుడు రూ.100, రూ.50 ఫేక్ కరెన్సీ పైన పాకిస్తాన్‌లో మాట్లాడుకుంటోంది. అయితే, ఇప్పుడు రూ.500, రూ.1000 నోట్లు కొత్తగా సెక్యూరిటీతో వచ్చినట్లుగానే.. త్వరలో చిన్న నోట్లు కూడా సెక్యూరిటీతో వస్తాయని చెబుతున్నారు.

మోడీ ప్రభుత్వం నిర్ణయం పాకిస్తాన్‌లోని ఫేక్ కరెన్సీ రాకెట్ సూత్రధారులకు పెద్ద దెబ్బ. అలాగే దావూద్ ఇబ్రహీం అండ్ గ్యాంగ్‌కు చాలా పెద్ద దెబ్బే.

ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి

రూ.100 ఫేక్ కరెన్సీ నోట్లను తయారు చేసే ఆలోచనలో దావూద్ అండ్ గ్యాంగ్ పడింది. అయితే, ఖర్చుతో పాటు త్వరలో రూ.100 నోట్లు కూడా సెక్యూరిటీతో రానున్నందున.. ఈ పేక్ కరెన్సీ తయారు చేసేందుకు ఫేక్ రాకెట్ సూత్రధారులు ఒకటికి రెండుసార్లు ఆలోచించవలసి ఉంటుంది. వారి పూర్తి పెట్టుబడి కూడా వృథా అయ్యే అవకాశముంది. కొత్త నోట్లు సెక్యూరిటీతో వచ్చాయి. కాబట్టి ఫేక్ కరెన్సీ తయారీ సులభం కాదంటున్నారు.

ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ఇలాంటి నోట్లను ఫోర్జరీ చేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. కొత్త నోట్లలో ఎన్నో సెక్యూరిటీ అంశాలు ఉన్నాయని తెలిపారు. కాబట్టి ఫేక్ నోట్లు తయారు చేయడం కుదరదని అంటున్నారు.

ఇదివరకు రూ.500, రూ.1000 నోట్లను పాకిస్తాన్‌లోని ఫేక్ కరెన్సీ రాకెట్ సూత్రధారులు సులభంగా తయారు చేశారని, వారు మనం నోట్లను తయారు చేసేందుకు పేపర్ ఎక్కడి నుంచి తెస్తామో వారు అక్కడి నుంచే తెస్తున్నారని చెబుతున్నారు. పైగా, పాత నోట్లలో సెక్యూరిటీ అంశాలు అంత కష్టంగా లేవని చెబుతున్నారు. దీంతో సులభంగా ఫేక్ కరెన్సీని తయారు చేసేవారని అంటున్నారు.

English summary
It would be safe to say now that the fake currency industry is officially dead. The scrapping of the Rs 500 and 1,000 notes killed the entire industry in one go.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X