అందమైన భార్యకు ఫోన్ చేసిన భర్త, కూతురితో కలిసి బయటకు వెళ్లింది, ఆతర్వాత ?
వాళ్లది చాలా చిన్న అందమైన కుటుంబం. భర్త, భార్య, వాళ్ల బిడ్డ ఉన్న ఇల్లు. అయితే ఈ ఇంట్లోని ముగ్గురు వ్యక్తులు ఒకే రోజు అదృశ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు పోలీసులను కూడా గందరగోళానికి గురిచేసింది. కుటుంబంలోని ఆ ముగ్గురి ఆచూకి కనుగొనడానికి వాళ్ల కుటుంబం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది. అయితే అందమైన భార్య, భర్త, చిన్నారి మాయం కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
కర్ణాటకలోని దావణగెరెలోని బట్టర్‌నగర్‌లో దంపతులు, వాళ్ల చిన్నారి అదృశ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంజన్‌బాబు (34), నాగవేణి (26) దంపతులు, వాళ్ల రెండేళ్ల నక్షత్రా అనే అమ్మాయి కనిపించలేదని నాగవేణి తల్లి పోలీసులను ఆశ్రయించారు. దావణగెరెలోని వినోబా నగర్‌లో అంజన్ బాబు, నాగవేణి దంపతులు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. గత నెల ఏప్రిల్ 12వ తేదీన చివరిసారిగా నాగవేణి వాళ్ల అమ్మకు కనిపించింది.

ఆ తర్వాత ఈ ముగ్గురు ఎక్కడికి వెళ్లారో తెలియక వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నా కూతురు, అల్లుడు, మనవరాలిని కనిపెట్టాలంటూ నాగవేణి తల్లి రుద్రవ్వ దావణగెరెలోని లేఔట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐదు సంవత్సరాల క్రితం అంజన్ బాబు, నాగవేణి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రెండేళ్ల నక్షత్రా అనే కుమార్తె ఉంది. వినోబానగర్‌లో నివాసముంటున్న అంజన్ బాబు పీజీ బాడగి షెట్టర్ స్కూల్ సమీపంలోని స్టాక్ మార్కెట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
నాగవేణి తల్లి రుద్రవ్వ వారానికోసారి కూతురు ఇంటికి వచ్చేది. గత నెల ఏప్రిల్ 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో రుద్రవ్వ తన కుమార్తె నాగవేణి ఇంటికి వచ్చింది. రుద్రవ్వ సాయంత్రం వరకు కూతురు నాగవేణి, మనవరాలు నక్షత్రాతో గడిపారు. ణి భర్త అంజన్ బాబు సాయంత్రం ఆరు గంటల సమయంలో అతని భార్య నాగవేణికి ఫోన్ చేశాడు. తర్వాత నాగవేణి ఆమె కూతురు నక్షత్రాతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి రెడీ అయ్యింది.
ఆ తర్వాత నాగవేణి ఆమె తల్లిని ఇంట్లోనే ఉండమని చెప్పింది. నీ భర్త అంజన్ బాబు ఎక్కడికి వెళ్లాడని తల్లి అడగ్గా నేను ఇంటికి వచ్చి చెబుతానని తల్లికి చెప్పిన నాగవేణి ఆమె కూతురు నక్షత్రాని తీసుకెళ్లిపోయిందని రుద్రవ్వ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన కూతురు నాగవేణికి రాత్రి 8.30 గంటలకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారని తాను అడిగానని, మేము రేపు ఉదయం ఇంటికి వస్తామని, మీరు భోజనం చేసి పడుకోండి అని నాగవేణి తనకు చెప్పిందని రుద్రవ్వ పోలీసులు సమాచారం ఇచ్చింది
మరుసటి రోజు ఉదయం తన కుమార్తె నాగవేణికి ఫోన్ చేస్తే ఆమె ఫోన్ స్విచ్ ఆప్ అయ్యిందని రుద్రవ్వ పోలీసులకు చెప్పింది. దీంతో రుద్రవ్వ పనికి వెళ్లాల్సి రావడంతో కూతురు నాగవేణి ఇంటికి తాళం వేసి ఆమె సొంత గ్రామానికి వెళ్లింది. కొన్ని రోజులుగా నాగవేణి, ఆమె భర్త, కూతురు తిరిగి రాకపోవడంతో బంధువులకు ఫోన్ చేసిన రుద్రవ్వ వారి గురించి విచారించారు. అన్ని చోట్ల వెతికినా ప్రయోజనం లేకపోయింది.
దీంతో ఆందోళన చెందిన రుద్రవ్వ దావణగెరెలోని లేఔట్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన కూతురు, అల్లుడు, మనవరాలి కోసం వెతకాలని మనవి చేస్తూ ఫిర్యాదు చేసింది. మాయం అయిన అంజన్ బాబుకు చాలా అప్పులు ఉన్నాయని, అతను చాలా మందికి డబ్బు బాకీ పడ్డాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మరోవైపు ఆస్తి విషయంలోనూ సమస్య ఉందని, ఈ నేపథ్యంలోనే అంజన్ బాబు, నాగవేణి దంపతులు, వారి కుమార్తెను కిడ్నాప్ చేసి ఉంటారని వారి కుటుంబ సభ్యులు, నాగవేణి బంధువులు ఆరోపిస్తున్నారు.
మొత్తానికి అంజన్ బాబుతో పాటు అతని భార్య నాగవేణి, కుమార్తె నక్షత్రా ఇన్ని రోజులు అయినా ఎక్కడా కనపడకపోవడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో ఒకే కుటుంబంలో ముగ్గురు మాయం కావడం పోలీసులకు సవాలుగా మారింది. చివరికి బీజాపూర్ జిల్లాలోని టికోటా గ్రామంలో అంజన్ బాబు కుటుంబం ఉందని అనుమానిస్తున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ అంజన్ బాబు కుటుంబ సభ్యులు కనపడలేదని సమాచారం.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!










Click it and Unblock the Notifications