Lady: నీకు ఎంత మంది మొగుళ్లు కావాలి, ఎంతమంది పిల్లల్ని కంటావు, ఫస్ట్ భర్త ఫ్యామిలీ ఏం చేసిందంటే?
రాజ్ కోట్/ గుజరాత్: రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయాడు. పుట్టింటికి వెళ్లిపోయిన మహిళ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రెండో భర్తతో కాపురం చేసి ఓ కూతురికి తల్లి అయ్యింది. మొదటి భర్త సొంత ఊరిలో పని ఉండటంతో ఆమె అక్కడికి వెళ్లింది. మొదటి భర్త కుటుంబ సభ్యులు ఆమెను చూసి ఏమే టిక్కులాడి, నీకు రెండో మొగుడు కావాలా ?, ఇంకా ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటావు ?, ఎంత మంది పిల్లలను కంటావు అంటూ ఆమె మీద నడిరోడ్డులో దాడి చేశారు. రెండో పెళ్లి చేసుకున్న మహిళను విద్యుత్ స్థంభానికి కట్టేసి బట్టలు చింపేసి ఇష్టం వచ్చినట్లు చితకబాదడంతో ఆమె ఐసీయూలో చావుబతుకులతో పోరాడుతోంది.

భర్త చనిపోయాడు
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని రాజ్ కోట్ సమీపంలో భాను సదామియా అలియాస్ భాను (35) అనే మహిళ నివాసం ఉంటున్నది. చాలా సంవత్సరాల క్రితం భాను వివాహం చేసుకుంది. భాను దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమారుడు ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం భాను భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.

రెండో పెళ్లి చేసుకున్న మహిళ
భర్త చనిపోయిన సంవత్సరం తరువాత భాను ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. రెండు సంవత్సరాల క్రితం భాను మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రెండో భర్తతో కాపురం చేసిన భాను ఓ కూతురికి తల్లి అయ్యింది. భానుకు ప్రస్తుతం ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో భర్తతో భాను వేరే ఊరిలో నివాసం ఉంటున్నది.

రగిలిపోయిన మొదటి భర్త సోదరి
మూడు సంవత్సరాల తరువాత భాను రాజ్ కోట్ కు వెళ్లింది. మొదటి భర్త నివాసం ఉంటున్న ఇంటి సమీపంలోకి భాను వెళ్లింది. ఆ సందర్బంలో భాను మొదటి భర్త సోదరి ఆమెను చూసింది. మా సోదరుడు చనిపోయాడు అని ఏమాత్రం బాధలేకుండా నువ్వు వేరేవాడిని పెళ్లి చేసుకుని వాడితో కులుకుతున్నావా అంటూ ఆమె భానును పట్టుకుని నడిరోడ్డులో చితకబాదేసింది. భర్తను పిలిపి ఇద్దరూ కలసి భానును చితకబాదేశారు.

విద్యుత్ స్థంభానికి కట్టేసి?
నీకు రెండో మొగుడు కావాలా ?, ఇంకా ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటావు ?, ఎంత మంది పిల్లలను కంటావు అంటూ మొదటి భర్త సోదరి, ఆమె భర్త, పక్కింటి వాళ్లు కలసి భాను మీద నడిరోడ్డులో దాడి చేశారు. రెండో పెళ్లి చేసుకున్న భానును విద్యుత్ స్థంభానికి కట్టేసి బట్టలు చింపేసి ఇష్టం వచ్చినట్లు చితకబాదేశారు.

మహిళను కాపాడిన అత్తమామలు
మొదటి భర్త తల్లిదండ్రులకు విషయం తెలిసి అక్కడికి వెళ్లి భానును రక్షించి రాజ్ కోట్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. భాను పరిస్థితి చాలా విషమంగా ఉందని, ఆమె ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు అన్నారు. .భాను మొదటి భర్త సోదరి, ఆమె భర్త, పక్కింటి వాళ్లను అరెస్టు చేశామని రాజ్ కోట్ పోలీసులు తెలిపారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications