soldier: సైనికుడి హత్య కేసులో అధికార పార్టీ లీడర్ ఫ్యామిలీ అందర్, రాజకీయాలు వద్దు, భార్య విషయంలో ?
సైనికుడి కుటుంబ సభ్యులకు, ఆ రాజకీయ నాయకుడి కుటుంబ సభ్యులకు గొడవ జరిగింది. ఈ గొడవల కారణంగా ఓ సైనికుడు హత్యకు గురై అతని కుటుంబ సభ్యులకు తీవ్రగాయలైన సంఘటన కలకలం రేపింది.
చెనై/ క్రిష్ణగిరి/హోసూరు: అన్నదమ్ములు ఇద్దరూ భారత ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నారు. సైన్యంలో పని చేస్తున్న యువకులు ఇద్దరూ సెలవుల మీద ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతూ తరువాత మళ్లీ ఉద్యోగాలకు వెలుతున్నారు. సైనికుల బంధువులు రాజకీయాల్లో ఉంటున్నారు. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న బంధువులకు చిన్నచిన్న గొడవలు ఉన్నాయి. ఈ సందర్బంలో సైనికుల కుటుంబ సభ్యులకు, ఆ రాజకీయ నాయకుడి కుటుంబ సభ్యులకు గొడవ జరిగింది. ఈ గొడవల కారణంగా ఓ సైనికుడు హత్యకు గురై అతని కుటుంబ సభ్యులకు తీవ్రగాయలైన సంఘటన కలకలం రేపింది. ఈ హత్య కేసులో అధికార పార్టీకి చెందిన నాయకుడితో పాటు అనేక మంది అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

సైన్యంలో సోదరులు
తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని వెలంపట్టి సమీపంలోని ఎంజీఆర్ నగర్ ప్రాంతంలో చిన్నస్వామి(50) అనే ఆయన నివాసం ఉంటున్నాడు. నాగోజనహళ్లి మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ గా చిన్నస్వామి విజయం సాధించాడు అదే ప్రాంతానికి చెందిన సోదరులు ప్రభాకరన్ (30), ప్రభు (28) అనే ఇద్దరు యువకులు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నారు.

సైనికుడి భార్య బట్టలు ఉతుకుతుంటే ?
సైనికుడు ప్రభాకరన్ భార్య ప్రియా కొద్దిరోజుల క్రితం వీధిలోని పంచాయతీ పబ్లిక్ వాటర్ ట్యాంక్ ముందు బట్టలు ఉతుకిందని సమాచారం. ఇది చూసిన కౌన్సిలర్ చిన్నస్వామి ఇది పబ్లిక్ వాటర్ ట్యాంక్ అని, ఇక్కడు మీరు బట్టులు ఉతకడానికి వీలులేదని, మీరు ఎక్కడైనా బట్టలు ఉతుక్కోవాలని హెచ్చరించారు. ఆ సమయంలో కౌన్సిలర్ చిన్నస్వామి, ప్రియాల మధ్య వాగ్వాదం జరిగింది. అప్పుడు సమీపంలోని వ్యక్తులు ఇద్దరిని రాజీ చేసి అక్కడి నుంచి పంపించారు.

ప్రతీకారంతో సైనికుడి హత్య ?
తరువాత మ్యాటర్ తెలుసుకున్న సైనికుడు ప్రభాకరన్ అతని సమీప బంధువు అయిన అధికార పార్టీ కౌన్సిలర్ చిన్నస్వామిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నారు. తరువాత కౌన్సిలర్ చిన్నస్వామి, ఆయన కుటుంబ సభ్యుల, బంధువులతో వెళ్లి సైనికులు ప్రభూ అతని సోదరుడు మరో సైనికుడు ప్రభాకరన్, తల్లి కన్నమ్మాళ్, తండ్రి మత్తయ్యన్ పై తీవ్రంగా దాడి చేశాడు. గాయపడిన నలుగురు వ్యక్తులు హోసూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన ప్రభు మృతి చెందాడు.

సైనికుడి హత్య కేసులో 9 మంది ?
మొదట ప్రభుపై దాడి జరిగిందని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తువాత నాగరసంబట్టి పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి ఈ కేసులో డీఎంకే పార్టీ కౌన్సిలర్ చిన్నస్వామి, గురుమూర్తి, మతియన్, మణికందన్, వెడియప్పన్, రాజపాండి, గుణనిధి, కాళియప్పన్, పులిపాండి తదితరులతో పాటు మొత్తం 9 మందిని అరెస్టు చేశారు.

రాజకీయాలు చేస్తారా ?
సైనికుడు ప్రభు హత్య కేసు విషయం తమిళనాడును కుదిపేస్తోంది. క్రిష్ణగిరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సరోజ్ కుమార్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ ఆర్మీ జవాను హత్య కేసుకు సంబంధించి ఇప్పటకే 9 మందిని అరెస్టు చేమని, ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని, దాడి చేసినవారు, గాయపడినవారు, మరణించిన సైనికుడు ప్రభు అందరూ చాలా దగ్గర బంధువులేనని, మామూలుగా కొట్టడుకోవడంతో చివరికి అది హత్యకు దారి తీసిందని సరోజ్ కుమార్ వివరించారు.

సీరియస్ అయిన అన్నామలై
కొన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కావాలనే రాజకీయ కోణంలో ఈ హత్య కేసును రాజకీయం చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అలా చేసేవారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సరోజ్ కుమార్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సైనికుడు ప్రభు హత్యను ఖండిస్తూ తమిళనాడు వ్యాప్తంగా బీజేపీ తరపున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

రూ. ఒక కోటీ పరిహారం..... ప్రభుత్వ ఉద్యోగం
అన్నామలై ప్రకటన అనంతరం క్రిష్ణగిరి తూర్పు జిల్లా బీజేపీ తరపున వెలంపట్టి బస్ స్టేషన్ దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించడం కలకలం రేపింది. హత్యకు గురైన సైనికుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మాజీ సైనికులు, బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications