కేరళలో ఉద్యోగం పొందిన ట్రాన్స్ జెండర్, చరిత్రే
కేరళ రాష్ట్రంలోని ఓ బహుళజాతి సంస్థలో ట్రాన్స్ జెండర్ కు ఉద్యోగం దక్కింది. జారా షికా అనే ట్రాన్స్ జెండర్ బహుళజాతి సంస్థలో ఉద్యోగం దక్కించుకొని రికార్డులకెక్కారు.
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని ఓ బహుళజాతి సంస్థలో ట్రాన్స్ జెండర్ కు ఉద్యోగం దక్కింది. జారా షికా అనే ట్రాన్స్ జెండర్ బహుళజాతి సంస్థలో ఉద్యోగం దక్కించుకొని రికార్డులకెక్కారు.
జారాషికాకు 27 ఏళ్ళు. తొలుత పురుషుడిగా ఉన్నారు. అయితే చెన్నై, అబుదాబిలో పలు సంస్థల్లో హెచ్ ఆర్ విభాగంలో పనిచేశారు. కానీ, కొన్నాళ్ళ క్రితం అతనిలో స్త్రీ లక్షణాలు బయటపడ్డాయి.

అయితే అవి బయటపడకుండానే ఆయన ఉద్యోగాలు కొనసాగించాడు. అయితే పనిచేసే జారాకి వేధింపులు ఎక్కువయ్యాయి.దీంతో 2015 లో ఉద్యోగం మానేసి భారత్ కు తిరిగి వచ్చాడు.
స్త్రీ మాదిరిగానే ఆయన జీవించాలనుకొన్నాడు. వేషధారణ మార్చేసి అమ్మాయిగా మారాడు. అప్పటి నుండి ఆమెకు అన్నిచోట్ల వ్యతిరేకత ఎదురైంది. ఉద్యోగం కోసం వెళ్ళిన ప్రతిచోట తనకున్న నాలుగున్నరఏళ్ళ ఉద్యోగ అనుభవం, ప్రతిభతో ఎంపికయ్యేది.
కానీ, తను ట్రాన్స్ జెండర్ అనే విషయం తెలియగానే ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించేవారు. అదే సమయంలో ట్రాన్స్ జెండర్ సమక్షేమం కోసం పాటుపడే క్వీరిథమ్ అనే స్వఛ్చంధ సంస్థలో పనిచేసే ఓ వ్యక్తి జారాకి సహాయం అందించారు.
యుఎస్టీ గ్లోబల్ అనే బహుళజాతి కంపెనీలోని మానవవనరుల విభాగంలో ఉద్యోగం ఉందని చెప్పి అక్కడికి పంపించారు. ఆ సంస్థ ట్రాన్స్ జెండర్లకు మద్దతు పలికే సంస్థే. మూడు ప్రక్రియల్లో ఉత్తీర్ణురాలైన జారాకు ఉద్యోగమిచ్చింది. హెచ్ ఆర్ విభాగంలోని 45 మంది ఉద్యోగులు తనకు మద్దతుగా నిలిచారని జారా ఆనందం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications