భార్యను రెండు సార్లు చంపాలనుకున్న మాజీ మంత్రి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి, ఢిల్లీ శాసన సభ్యుడు సోమనాథ భారతి చుట్టు ఉచ్చు బిగిస్తోంది. ఆయన తప్పు చేసినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. సోమనాథ్ భారతి మీద నమోదు చేసిన కేసు వివరాలను ఢిల్లీ హై కోర్టుకు సమర్పించారు.
సోమనాథ భారతి రెండు సార్లు ఆయన భార్యను హత్య చెయ్యడానికి ప్లాన్ వేశారని పోలీసులు ఢిల్లీ హై కోర్టులో చెప్పారు. ఇప్పటికే గృహహింసతో పాటు హత్య చేసేందుకు కూడా తన భర్త ప్రయత్నించాడని సోమనాథ భారతి భార్య లిపిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు పురోగతిని హై కోర్టుకు వివరించారు. లిపిక గర్బవతిగా ఉన్న సమయంలో హత్య చెయ్యడానికి మొదటి సారి ప్రయత్నించారని, తరువాత ఆమె మణికట్టును చీల్చి హత్య చెయ్యడానికి రెండవ సారి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.
అయితే గురువారం కూడా హై కోర్టు సోమనాథ్ భారతిని అరెస్టు చెయ్యడానికి అనుమతి ఇవ్వలేదు. అదే సమయంలో సోమనాథ్ భారతీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై నిర్ణయాన్ని కూడా వాయిదా వేశారు.
కోర్టు విచారణకు హాజరైన సోమనాథ్ భారతి లిపిక పలు ఆరోపణలు చేశారు. తన భర్త సోమనాథ్ భారతి తన కుక్క డాన్ తో దాడి చేయించాడని ఆరోపించింది. అదే విధంగా తన నగలు తన భర్త దగ్గర ఉన్నాయని, వాటిని తనకు ఇప్పించాలని లిపిక హై కోర్టులో మనవి చేసింది.












Click it and Unblock the Notifications