బాస్ అయిపోవాలని ప్లాన్ చేసిన రౌడీషీటర్, అర్దరాత్రి ఫ్రెండ్స్ చేతిలో ?, సీసీటీవీల్లో !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలో రానురాను పాతక్షలు భగ్గుమంటున్నాయి. ఓ యువకుడిని అతని స్నేహితులు దారుణంగా హత్య చేసిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు కావడంతో ఆ క్లిప్పింగ్స్ బయటకు వచ్చి వైరల్ కావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. యువకుడి హత్యకు సంబంధించి బెంగళూరులోని మహదేవపుర పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.ప్రశాంత్, శ్రీకాంత్, వసంత్‌లు అనే నిందితులు అరెస్టు అయ్యారు.
మే 25న మహదేవపురలో రేణు కుమార్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. అరెస్టు అయిన ముగ్గురు హత్యకు గురైన రౌడీ షీటర్ రేణు కుమార్‌కు సహచరులు. రేణు కుమార్ కొద్ది రోజుల క్రితం జైలు నుంచి విడుదల అయ్యాడు. హత్య, దోపిడీ, దాడి వంటి 7కి పైగా నమోదు అయిన క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న రౌడీ షీటర్ ఈ రేణు కుమార్. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రేణు కుమార్ రౌడీషీటర్‌గా అవతారం ఎత్తాడు.

నేను ఇప్పటికే చాలాసార్లు జైలుకు వెళ్ళిన వాడిని, మీరందరూ నా మాట వినాలి. నేను మీ గ్యాంగ్ లీడర్, నేను లేకుండా మీరు ఏ పనికి ఒంటరిగా వెళ్లకూడదని, నాకు తెలీకుండా మీరు ఎవ్వరు ఎలాంటి మామాళ్లు వసూలు చెయ్యకూడదని రేణు కుమార్ అతని స్నేహితులను బెదిరించడం మొదలు పెట్టాడు. రానురాను రేణు కుమార్ హంగామా ఎక్కువ అయ్యింది.
రేణు కుమార్ ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని అంతం చేస్తాడంటూ రేణు కుమార్ హత్యకు అతని స్నేహితులే స్కెచ్ వేశాడు. ముందుగా అనుకున్న ప్రకారం మే 25వ తేదీ రాత్రి రేణు కుమార్ ఒక్కడే ఇంటికి బయలుదేరాడు. నిందితులు రాత్రి మార్గమధ్యంలో రేణు కుమార్ ను అడ్డగించారు. కేవలం 40 సెకన్లలో 26 సార్లు కత్తులతో రేణు కుమార్ ను పొడిచి దారుణంగా హత్య చేశారు. రేణు కుమార్ ను హత్య చేసిన అనంతరం నిందితులు పరారైనారు.
రేణు కుమార్ హత్య ఘటన సీసీటీవీలో రికార్డు అయ్యింది. మహదేవపుర పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో రేణు కుమార్, ప్రశాంత్, శ్రీకాంత్, వసంత్ లు కలిసే తిరిగేవాళ్లు. ఎప్పుడు అయితే స్నేహితులకు బాస్ అయిపోదామని రేణు కుమార్ ప్లాన్ వేశాడో అప్పుడే వీళ్ల మధ్య గొడవలు మొదలైనాయని, అదే హత్యకు దారితీసిందని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications