ఐఎస్ఐఎస్: ఫేస్ బుక్ అకౌంట్స్ పై వేటు
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రెండు ఫేస్ బుక్ అకౌంట్స్ పై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు ఫేస్ బుక్ అకౌంట్స్ నిర్వహిస్తున్న వారిని పట్టుకునే పనిలో ఐబి అధికారులు ఉన్నారు.
జమ్మూ కాశ్మీర్ లో గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఫేస్ బుక్ అకౌంట్స్ ప్రారంభించారు. తరువాత ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులకు అనుకూలంగా ప్రచారం చేశారు. ఐఎస్ఐఎస్ లో చేరి జీహాది యుద్దం చెయ్యాలని యువతను రెచ్చగొట్టారు.

రెండు ఫేస్ బుక్ అకౌంట్స్ చూస్తున్న యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఆత్మాహుతి దాడులు ఎలా చెయ్యాలి, జీహాద్ శిక్షణ విధానాలు, బాంబులు ఎలా తయారు చెయ్యాలి అంటూ ఫేస్ బుక్ ద్వార శిక్షణ ఇస్తున్నారని అధికారులు అన్నారు.
ఇంటర్నెట్ ద్వారా ఎదురౌతున్న ఉగ్రవాద ముప్పును ఎలా ఎదుర్కోవాలి అని అధికారులు ఆలోచిస్తున్నారు. నిఘా, కేంద్ర హోం శాఖ, ఐటీ తదితర శాఖల సీనియర్ అధికారుల ఉన్నత స్థాయి బృందం బుధవారం ఢిల్లీలో సుధీర్ఘంగా ఈ విషయంపై చర్చించింది.












Click it and Unblock the Notifications