Agnipath: అగ్నిపథ్ నియామకంలో మార్పు.. ఇక నుంచి వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు..!
అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్‌మెంట్ నిబంధనలలో ప్రభుత్వం ఇప్పుడు ఒక మార్పు చేసింది
గత ఏడాది కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం త్రివిధ దళాల్లో సైనికుల నియామకం కోసం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్‌మెంట్ నిబంధనలలో ప్రభుత్వం ఇప్పుడు ఒక మార్పు చేసింది. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఆర్మీ అర్హత ప్రమాణాలను కూడా పెంచింది. అగ్నిపథ్ పథకానికి ఐటీఐ-పాలిటెక్నిక్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

ప్రీ-స్కిల్డ్
ప్రీ-స్కిల్డ్ యువత కూడా అగ్నిపత్ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనవచ్చని పేర్కొంది. ఐటీఐ- పాలిటెక్నిక్ పాసైన వారు టెక్నికల్ బ్రాంచ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. దీనివల్ల ప్రీ-స్కిల్డ్ యువతకు ప్రత్యేక ప్రోత్సాహం లభిస్తుందని వివరించింది. అంతేకాదు శిక్షణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ పెద్ద మార్పు తర్వాత, ఇప్పుడు మరింత మంది యువ అభ్యర్థులు పథకంలో చేరడానికి అవకాశం ఉంది.

ఫిబ్రవరి 16
గత ఫిబ్రవరి 16 నుంచి అగ్నిపత్ పథకం కింద, ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ల రిక్రూట్‌మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ సంవత్సరం 2023-24 కోసం అవివాహిత పురుష అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 15 మార్చి 2023 కాగా ఎంపిక పరీక్ష 17 ఏప్రిల్ 2023న జరుగనుంది.

రాత పరీక్ష
నోటిఫికేషన్ ప్రకారం, అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్ క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్నివీర్ ఎంపిక ప్రక్రియలో ఇటీవలి మార్పుల తర్వాత, ఇప్పుడు అభ్యర్థులు ముందుగా రాత పరీక్షను క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే ఫిజికల్ టెస్ట్‌కు పిలుస్తారు. ఫిబ్రవరి 16న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అగ్నివీర్ (జనరల్ డ్యూటీ) (ఆల్ ఆర్మ్స్) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు
అగ్నివీర్ (టెక్నికల్) (ఆల్ ఆర్మ్స్) కోసం 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులైతే అగ్నివీర్ క్లర్క్ (స్టోర్ కీపర్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 8-10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అగ్నివీర్ ట్రేడ్స్‌మన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ITI-పాలిటెక్నిక్ పాసైన యువత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications