స్టార్ హీరో యవ్వారం తెలుసుకోవడానికి హోం మంత్రి ఎంట్రి, ఏం జరుగుతోంది ?

కన్నడ నటుడు దర్శన్ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నప్పటికీ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ కాఫీ తాగుతూ, సిగరెట్లు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడని వెలుగు చూడటం కలకలం రేపుతోంది. మరోవైపు రౌడీ షీటర్లు అక్రమంగా దగ్గర ఉంచుకున్న మొబైల్ ఫోన్‌లో వీడియో కాల్ మాట్లాడుకుంటూ హాయిగా ఉంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

జైల్లో ఉంటున్నా హీరో దర్శన్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని ఆరోపణలు రావడం, ఫోటోలు బయటకు రావడంతో వాటిని చూసేందుకు కర్ణాటక హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్ స్వయంగా జైలుకు వెళ్లాలని నిర్ణయించారని తెలిసింది.

The Home Minister inspects the Central Jail to see the luxurious life Hero Darshan is leading

చిత్రదుర్గలోని రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసి రోడ్డు పక్కన విసిరేశారని నమోదు అయిన కేసులో నటుడు దర్శన్ జైలుకెళ్లాడు. ఎలాంటి ఫీలింగ్ లేకుండా జైలులో హీరో దర్శన్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని ఆరోపణలు రావడం హాట్ టాపిక్ అయ్యింది.

బెంగుళూరులోని పరప్ప అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న హీరో దర్శన్ సిగరెట్ తాగుతూ, వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతున్నాడని కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. హీరో .

దర్శన్ పేరుమోసిన రౌడీలు, చాలా మంది చిల్లర రౌడీషీటర్లతో సరదాగా గడుపుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఆ రౌడీలు కూడా హీరో దర్శన్‌కి సెల్యూట్ చేస్తూ మేము కూడా మీ అభిమానులే అని చెప్పుకుంటున్నారని తెలిసిందని కన్నడ మీడియా తెలిపింది.

పోలీసులు డబ్బులు దండుకుని హీరో దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు చేస్తున్నారని, ఆయనకు అన్ని సదుపాయాలు కల్పించడానికి పోలీసులు అనుమతించారనే ఆరోపణలు వచ్చాయి. హీరో దర్శన్ జైలులో ఎంజాయ్ చేస్తున్నాడని వెలుగు చూడటంతో సామాన్య ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ స్వయంగా హీరో దర్శన్ విలాసవంతమైన జీవితాన్ని చూసేందుకు పరప్పన అగ్రహార జైలుకు వెలుతున్నారు.

The Home Minister inspects the Central Jail to see the luxurious life Hero Darshan is leading
పరప్పన అగ్రహార జైలును స్వయంగా హోంమంత్రి పరమేశ్వర్ వస్తున్నారని తెలుసుకున్న జైలు అధికారులు హడావుడిగా జైలు పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. ఇందుకోసం జైలు రోడ్డులో క్లీనింగ్ పనులను ప్రారంభించారు. పరప్పన అగ్రహార జైలు ఆవరణలో జైలు అధికారులు, జైలు సిబ్బంది అంతా కలిసి పారిశుధ్య పనులు చేస్తున్నారు. దర్శన్‌కు ప్రభుత్వం రాచమర్యాదలు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

దర్శన్‌కు బిర్యానీ సరఫరా చేస్తున్నారని ఆరోపణ ఉన్నాయి. జైలులో ఉన్నప్పటికీ విలాసవంతమైన జీవితం గడుపుతున్న నటుడు దర్శన్ ఇంట్లో చేసిన భోజనం తినేందుకు అనుమతించాలని కోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పటికే బెంగళూరులోని పలు హోటళ్ల నుంచి నటుడు దర్శన్‌కు బిర్యానీ సరఫరా అవుతున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

బెంగళూరులోని శివాజీనగర్‌ హోటళ్ల నుంచి నటుడు దర్శన్‌కు రుచికరమైన భోజనం, చికెన్, మటన్ ముక్కలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై హోంమంత్రి పరమేశ్వర్‌కు కూడా తెలిసిందని, అందుకే ఆయన స్వయంగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లి వివరాలు తెసుకోవాలని నిర్ణయించారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+