ఓలా డ్రైవర్ అరాచకం: లేడీ లాయర్ తెలివిగా ?

బెంగళూరు: బెంగళూరు నగరంలో న్యాయవాదిగా పని చేస్తున్న ఓ యువతికి ఓలా డ్రైవర్ చుక్కలు చూపించాడు. రాత్రి పొద్దుపోయే వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆమెను తిప్పుతూ చిత్రహింసలకు గురి చేశాడు.

మాటలతో హింసించి, సిగెరేట్ తాగమని బలవంతం చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బెంగళూరు ఉత్తర విభాగంలో నివాసం ఉంటున్న ఓ మహిళా న్యాయవాది సోమవారం రాత్రి విఠల్ మల్యా రోడ్డులో ఉన్నారు. హెబ్బాలకు వెళ్లడానికి ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నారు.

ఓలా క్యాబ్ వచ్చిన తరువాత ఆమె అందులో కుర్చున్నారు. డ్రైవర్ వాహనం నడుపుతూ మార్గం మద్యలో అన్ని డోర్లు లాక్ చేసి గ్లాస్ డోర్స్ మూసివేశాడు. హెబ్బాల ఫ్లై ఓవర్ రాగానే ఆమె చెప్పిన గమ్యస్థానానికి వెళ్లకుండా ఔటర్ రింగ్ రోడ్డులో కారు నడిపాడు.

నాగవార సమీపంలోని కెంపాపుర దగ్గరకు వెళ్లాడు. తరువాత ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే ఊరికి వెళ్లిన తల్లికి, నగరంలోని స్నేహితులకు మెసేజ్ ద్వారా సమాచారం ఇచ్చింది. డ్రైవర్ ఆమెను కారులో పెట్టి డోర్ లాక్ చేసి వెళ్లి రెండు సిగరేట్లు తీసుకువచ్చాడు. తరువాత ఆమెను మాటలతో చిత్ర హింసలు పెట్టాడు.

మీరు మందుతాగుతారా ? మీరు హౌస్ వైఫ్ కదా ? ఇంత రాత్రిలో ఎందుకు బయటకు వచ్చారు ? సిగరేట్ తాగుతారా ? అంటూ వేధించడం మొదలు పెట్టారు. అయితే ఆమె తెలివిగా అతని నుంచి తప్పించుకోవాలని ప్లాన్ వేసుకుంది.

The horror tales of misbehaviour by drivers in Bengaluru

రెండు సిగరేట్లు బయటకు తీసిన ఓలా డ్రైవర్ ఒకటి ఆమెకు ఇచ్చి తాగమని బలవంతం చేశాడు. నావయస్సు జస్ట్ 25 అంటూ ఆమె ముందు బిల్డప్ ఇచ్చాడు. ఆమెను మాటల్లో పెట్టి వివిధ ప్రాంతాల్లో తిప్పాడు. మీకు ఎప్పుడైనా క్యాబ్ కావాలంటే నాకే చెప్పండి అని అన్నాడు.

మళ్లీ మీరు ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వస్తారు అని ప్రశ్నించాడు. ఆమె సిగరేట్ తాగకుండా చేతిలో పెట్టుకుని నైస్ గా అతనికి మాయమాటలు చెప్పింది. చివరికి తనను ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యాలని నచ్చచెప్పింది. అర్దరాత్రి ఆమెను ఇంటి వైపు తీసుకు వెళ్లాడు.

చివరికి ఇంటి దగ్గర కాకుండా మరి కొంత దూరంలో ఆమెను డ్రాప్ చేశాడు. చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో తాను ఏమి చెయ్యలేకపోయింది. చివరికి అతనికి నకిలి పేరు చెప్పి తన పాత మొబైల్ నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి పంపించి తాను ఇంటికి చేరుకున్నానని ఆమె చెప్పింది.

మంగళవారం ఉదయం ఆమెకు వాట్సాప్ లో డ్రైవర్ సమాచారం పంపించాడు. మీ నెంబర్ తో నేను కారు బుక్ చేశానని పంపించాడు. చివరికి మహిళా న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాజీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని పోలీసుల దగ్గర వాపోయారు.

కఠిన చర్యలు తీసుకుంటాం: ఓలా

ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే డ్రైవర్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఓలా కంపెనీ ప్రతనిధులు తెలిపారు. మహిళా న్యాయవాదికి ఇబ్బంది కలిగించినందుకు వారు క్షమాపణలు చెప్పారు. ఆ డ్రైవర్ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు.

డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం

మహిళా న్యాయవాదిని ఇబ్బందులకు గురి చేసిన డ్రైవర్ మీద పోలీసులు కేసు నమోదు చేస్తారని, అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ జే. జనార్దన్ కుమార్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+