హోటల్ లోకి ఎస్సీలు నో ఎంట్రీ, టిఫిన్ కోసం వెళితే హోటల్ ఓనర్ భార్యతో ?, క్లైమాక్స్ !

భారతదేశంలోని అన్ని మతాలు వాళ్లు, కులాల వాళ్లు ఒక్కటే అంటూ అన్ని రాజకీయ పార్టీల నాయకులు పబ్లిక్ మీటింగ్ ల్లో మైకులు పగిలిపోయేలా పదేపదే చెబుతుంటారు. మతం పేరుతో, కులం పేరుతో ఇతరులను దూషించే వాళ్ల మీద కోర్టులు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఐటీ రంగంలో దూసుకుపోతున్న ఇలాంటి కాలంలో కూడా అక్కడక్కడా కులం పేరుతో కొందరిని దూషిస్తున్నారని వెలుగు చూస్తోంది.

కులం పోరుతో ఇతరులను దూషిస్తున్న కొన్ని అగ్రవర్ణాలకు చెందిన వారి మీద కేసులు నమోదు అయ్యాయి. చట్టపరంగా ఎన్ని మార్పులు తీసుకువస్తున్నా కొందరు మాత్రం కుల పిచ్చితో పాతపాట పాడుతున్నారు. వ్యాపారులు సైతం తక్కువ జాతి వాళ్లతో మేము వ్యాపారం చెయ్యమని ముఖం మీద చెబుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో చాలా వెలుగు చూశాయి. అలాంటి వాళ్ల మీద ఎస్టీ, ఎస్టీ కేసులు నమోదు అవుతున్నా ఇలాంటి సంఘటనలు పదేపదే వెలుగు చూస్తున్నాయి.

 The hotel owners stopped the residents of SC Colony who went to have tiffin in the hotel in Karnataka.

దళితులను హోటల్‌లోకి అనుమతించకుండా అవమానించిన సంఘటన కర్ణాటకలోని బళ్లారి సమీపంలోని కురుగోడు తాలూకా గుత్తిగనూరు గ్రామంలో చోటుచేసుకుంది.

ఎస్సీ కాలనీ వాసులు శేఖరప్ప, అయ్యప్ప, పరుశురామ్, రమేష్‌, మహేష్‌లు గుత్తిగనూరు బాలాపూర్‌ రోడ్డులోని వీరభద్రప్ప హోటల్‌ లో టిఫిన్ చేసేందుకు వెళ్లగా ఆ హోటల్‌ యజమాని వీరభద్రప్ప వారిని అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

మీరు హోటల్‌లోకి వెళ్లకుడదని, మీరు హోటల్ బయట కుర్చుని టిఫిన్ చెయ్యాలని వాళ్లను హోటల్ బయట కూర్చోవాలని ఆ హోటల్ యజమాని వీరభద్రప్ప సూచించారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా మమ్మల్ని అంటరానితనం పేరుతో హోటల్ బయట కుర్చోమని చెప్పడం సరికాదని హోటల్ యజమాని వీరభద్రప్ప, ఆయన భార్య నాగవేణితో ఎస్సీ కాలనీకి చెందిన వాళ్లు వాదనకు దిగారని తెలిసింది.

మీరు హోటల్ లోకి వస్తే మా హోటల్ లో టిఫిన్ తింటున్న వాళ్లు బయటకు వెళ్లిపోతారని, మరోసారి వాళ్లు మా హోటల్ లోకి రారని, మీ మీద జాలి చూపిస్తే మాకు వ్యాపారంలో నష్టం వస్తుందని వీరభద్రతప్ప, ఆయన భార్య ఎస్సీ కాలనీవాళ్లకు తేల్చి చెప్పారని ఆరోపణలు ఉన్నాయి. తమను అనరాని మాటలతో దూషించారని శేఖరప్ప శుక్రవారం కురుగోడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 The hotel owners stopped the residents of SC Colony who went to have tiffin in the hotel in Karnataka.

కురుగోడు పోలీసు అధికారులు, తహసీల్దార్ రాఘవేంద్రరావు గ్రామాన్ని సందర్శించి శాంతి సమావేశం నిర్వహించారు. అయితే హోటల్ యజమాని మీద కేసు నమోదు చెయ్యకుండా పోలీసులు రాజీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఎస్సీ కాలనీకి చెందిన కొందరు ఆరోపిస్తున్నారు. హోటల్ యజమాని మీద కేసు నమోదు చెయ్యకపోతే తాము బళ్లారి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని ఎస్సీ కాలనీకి చెందిన కొందరు పోలీసులను హెచ్చరించడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+