గుజరాత్ హోం మినిస్టర్ ఇంటికి నిప్పు (ఫోటోలు)

అహమ్మదాబాద్: గుజరాత్ అగ్ని గుండంగా మారిపోయింది. రిజర్వేషన్ వివాదం చిచ్చురేపింది. ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ)లో తమను చేర్చాలని డిమాండ్ చేస్తు పటేల్ సామాజిక వర్గీయులు చేస్తున్న ఆందోళన మరింత హింసాత్మకంగా మారింది.

గురువారం ఆ సెగ గుజరాత్ హోం శాఖ మంత్రి రజనీ పటేల్ కు తగిలింది. కొందరు ఆందోళనకారులు హోం శాఖ మంత్రి రజనీ పటేల్ ఇంటికి నిప్పంటించారు. ఈ గొడవలలో మంత్రి రజనీ పటేల్ ఇళ్లు కొంత మేర దెబ్బతినింది.

గత రెండు రోజుల నుండి గుజరాత్ ఆందోళనలు, నిరసనలతో అట్టుడికిపోతుంది. పటేళ్లు ఎక్కువగా ఉంటున్న సూరత్, రాజ్ కోట్, మహాసేన నగరాల్లో కేంద్ర బలగాలు మోహరించి పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. వందల సంఖ్యలో వాహనాలు బూడిద అయ్యాయి.

ప్రధాని మోడీకి అగ్నిపరిక్ష

ప్రధాని మోడీకి అగ్నిపరిక్ష

భారత ప్రధాని నరేంద్ర మోడీకి అగ్నిపరిక్ష ఎదురైయ్యింది. సోంత రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవాలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

పటేల్ పవర్

పటేల్ పవర్

రిజర్వేషన్లు కల్పించాలని పటేల్ సామాజిక వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. పలు ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలు బూడిద చేశారు.

యువకుడి పిలుపు

యువకుడి పిలుపు

పలేట్ సామాజిక వర్గంలో 22 సంవత్సరాలు పూర్తి కాని హార్దిక్ పటేల్ నాయకుడు అయ్యాడు.

శాంతియుతంగా పోరాటం

శాంతియుతంగా పోరాటం

మంగళవారం రాత్రి నుండి గుజరాత్ మండిపోతుంది. శాంతియుతంగా పోరాటం చేద్దాం అని హార్దిక్ పటేల్ పిలుపునిచ్చాడు.

ప్రధాని మనవి చేసినా ఫలితం లేదు

ప్రధాని మనవి చేసినా ఫలితం లేదు

శాంతియుతంగా పోరాటం చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అయితే గుజరాత్ లో ఆయన మాటను లెక్క చెయ్యలేదు.

పాపులారిటి పవర్

పాపులారిటి పవర్

హార్దిక్ పటేల్ కు ఎక్కడలేని పాపులారిటి వచ్చేసింది. అతను బంద్ కు పిలువు ఇవ్వడం, గుజరాత్ అగ్నిగుండం కావడం అంతా రెండు రోజులలో జరిగిపోయింది.

అరెస్టు చేసి తప్పు చేశారు

అరెస్టు చేసి తప్పు చేశారు

మంగళవారం రాత్రి గుజరాత్ పోలీసులు హార్దిక్ పటేల్ ను అరెస్టు చేసి తప్పు చేశారు. అతను అరెస్టు అయిన తరువాత గొడవలు మొదలైనాయి.

ఆస్తులు ద్వంసం

ఆస్తులు ద్వంసం

హార్దిక్ పటేల్ అరెస్టు అయిన తరువాత గుజరాత్ లో ప్రభుత్వ బస్సులు ద్వంసం చేశారు. అనేక వాహనాలకు నిప్పంటించారు.

రంగంలోకి సైన్యం

రంగంలోకి సైన్యం

కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని గుజరాత్ లో సైన్యం దింపింది. గుజరాత్ లో పలు చోట్ల సైనికులు మోహరిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో కర్య్పూ ఉంది.

నయా మోడీ

నయా మోడీ

హార్దిక్ పటేల్ గుజరాత్ లో నయా మోడీ అయ్యాడు. అతను తలుచుకుంటే ఏమైనా చేస్తాడని గుజరాత్ లోనిపటేళ్లు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+