గోవాలో వారం రోజులు ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చిన వెంటనే భార్యను చంపేసిన భర్త, మ్యాటర్!
బెంగళూరు/ చిక్కమగళూరు/ గోవా: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేస్తున్నారు. రెండో భార్యతో చక్కగా కాపురం చేస్తున్న వ్యక్తి అతని భార్యను సినిమాలు, షికార్లు, టూర్లకు పిలుచుకుని వెలుతున్నాడు. వారం రోజుల పాటు గోవాలో దంపతులు ఇద్దరూ ఏకాంతంగా బీచ్ లు, పబ్ లు తిరిగి ఎంజాయ్ చేశారు. ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే భర్త చేతిలో అతని భార్య దారుణ హత్యకు గురైయ్యింది.
వారం రోజులుగా భార్యతో కలిసి గోవాలో తిరుగుతున్న భర్త. తిరిగి ఇంటికి వచ్చిన మరుసటి రోజు అతని భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు నగరంలోని క్రిస్టియన్ కాలనీలో చోటుచేసుకుంది. మృతురాలిని షామభాను(34)గా గుర్తించామని పోలీసులు తెలిపారు.భార్య బానును హత్య చేసిన ఆమె భర్త షబ్బీర్ అహ్మద్ నేరుగా నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

నిందితుడు షబ్బీర్ అహ్మద్ తన భార్య షామాభానుతో కలిసి వారం రోజుల క్రితం గోవా పర్యటనకు వెళ్లాడు. వారం రోజుల పాటు గోవా పర్యటనలో ఇద్దరూ చాలా సంతోషంగా గడిపారని, ఫోటోలు తీసుకుని స్టేటస్ లో పెట్టారని బంధువులు అంటున్నారు. గోవా నుంచి చిక్కమగళూరు సిటీలోని వచ్చిన షబ్బీర్, బాను దంపతులు బంధువులు, కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా మాట్లాడారని తెలిసింది.
గోవా నుంచి ఇంటికి తిరిగి వచ్చిన మరుసటి రోజే సుత్తితో భార్య బానును ఆమె భర్త షబ్బీర్ దారుణంగా హత్య చేశాడు. షబ్బీర్ ఇంటి గోడలన్నీ బాను రక్తంతో రక్తసిక్తంగా ఉన్నాయని వెలుగు చూడటం కలకలం రేపింది. నిందితుడు షబ్బీర్ మొదటి భార్య కరోనా సమయంలో కరోనా బారినపడి మృతి చెందింది.
పెద్ద భార్య చనిపోవడంతో ఏడాది క్రితం షామాభానును షబ్బీర్ రెండో పెళ్లి చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. ఇప్పుడు రెండో భార్య బానును సుత్తితో కొట్టి చంపేసిన షబ్బీర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.పోలీసులకు లొంగిపోయిన నిందితుడు షబ్బీర్ అసలు మ్యాటర్ చెప్పాడు.
నిద్రపోతున్న తనతో గొడవపడిన తన భార్య బాను తన ముఖాన్ని దిండుతో అదిమి ఊపిరిరాకుండా చేసి తనను చంపేందుకు ప్రయత్నించిందని, ఆ సమయంలో తాను కోపంతో సుత్తితో కొట్టి ఆమెను చంపేశానని చెప్పాడని పోలీసులు అంటున్నారు. అక్రమ సంబంధంకారణంగా బాను హత్యకు గురై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిక్కమగళూరు సిటీ పోలీసులు, ఎస్పీ విక్రమ్ అమటే వివరాలు సేకరించారు. నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications