కూతురి మీద కన్ను వేసి పక్క రూమ్ లో ?, అడ్డుపడిన భార్యను ఇలా చంపేసిన భర్త !

బెంగళూరు: మహారాష్ట్రలోని పూణేలోని లోనికాండ్‌లోని అవలవాడిలో ఓ కసాయి తండ్రి అతని కుమార్తెను లైంగికంగా వేధించిన షాకింగ్ సంఘటన జరిగింది. అంతే కాకుండా ఇదే విషయమై ఆరా తీసిన భార్యపై దారుణంగా దాడి చేయడంతో తీవ్రగాయాలతో ఆమె మృతి చెందిందని పోలీసు అధికారులు తెలిపారు.

గురువారం లోనికండ్‌లోని అవలవాడిలోని తమ ఇంటిలో తమ కుమార్తె (17)ని వేధించినందుకు 41 ఏళ్ల భర్తను ప్రశ్నించిన తర్వాత ఒక మహిళ (38) మీద ఆమె భర్త దారుణంగా దాడి చేశాడని పోలీసులు అన్నారు. ఆపై తీవ్రగాయాలైన భార్య మరణించింది. నిందితుడు తన భార్య తలను గోడకు కొట్టాడు. అలాగే కర్రతో ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టారు. తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడని పోలీసు అధికారులు తెలిపారు.

The husband brutally killed his wife who stopped her from sexually abusing her daughter in Pune.

కానీ ఆమె చనిపోయిందని తెలుసుకుని నిప్పంటించకుండా వదిలేశాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శశికాంత్ బోరటే తెలిపారు. బాధితుల వాంగ్మూలం ప్రకారం దంపతులకు 17, 15, 13 ఏళ్ల వయసు ఉన్న కుమార్తెలు ఉన్నారు. రోజు భర్త అతని భార్యను చితకబాదుతున్నాడని తెలిసింది. తమ తల్లిని కొట్టకుండా ఆపడానికి అమ్మాయిలు ప్రయత్నించినప్పుడు నిందితుడు వారిలో పెద్ద అమ్మాయిని పక్క గదిలోకి లాక్కెళ్లాడని, తరువాత మద్యం మత్తులో ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

అనంతరం ఆ వ్యక్తి వారిని గది నుంచి విడుదల చేసి విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు.అయితే ఆమె కుమార్తె ధైర్యం చేసి తన తల్లి, బంధువులకు జరిగిన సంఘటనను వివరించింది. తరువాత కూతురు విషయంలో భర్తను ప్రశ్నించిన భార్యను అతను హత్య చేశాడు. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రైతు అయిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నివేదిక కోసం మేము ఎదురుచూస్తున్నామని, అతను మద్యానికి బానిస అని దర్యాప్తులో తేలిందని సీనియర్ ఇన్‌స్పెక్టర్ విశ్వజీత్ కైంగడే చెప్పారు. ఆగస్టు 28వ తేదీ మధ్యాహ్నం తండ్రి మద్యం తాగి ఇంటికి వచ్చి వేధించాడని, బుధవారం రాత్రి నిద్రిస్తుండగా మళ్లీ వేధించాడని కుమార్తె పేర్కొంది. అనంతరం తనపై దాడి చేశారని తెలిపారు. నిందితుడిపై హత్య చేశాడని, సాక్ష్యాధారాల ధ్వంసం శాడని, అక్రమ నిర్బంధం, మైనర్ లను లైంగిక వేధింపులకు గురి చేశాడని కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+