నడిరోడ్డులో భార్యను కారులో నుంచి కిందకు దింపేసిన భర్త, బిత్తరపోయిన పోలీసులు

నీకు నా కారులో కూర్చోవడానికి అర్హత, ఆ యోగ్యతలేదు అంటూ భార్యను కారులో నుంచి మార్గం మధ్యలో దింపేసిన భర్త వేగంగా వెళ్లిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చోటుచేసుకుంది. తమ బిడ్డకు అనారోగ్యంగా ఉందని భార్యాభర్తలు డాక్టర్ వద్దకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే చిత్రవిచిత్రమైన శాడిస్టు భర్త చేసిన పని గురించి తెలుసుకున్న అందరూ షాక్ అయ్యారు.

తరువాత భార్య ఆమె భర్త ఇంటికి తిరిగి వచ్చిన ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చర్చల సమయంలో భర్త వికాస్ కారులో నుంచి ఎందుకు అతని భార్యను కిందకు దించారనేది తెలుసుకున్న పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

The husband dropped his wife from the car and left her on the road

నా కారులో కూర్చోవద్దు, నీకు ఆ హక్కు లేదు. భార్య ఇంటి నుంచి కారు కట్నంగా ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. తాను తీసుకెళ్లిన కారులో కూర్చునే హక్కు తనకు లేదని తన భర్త వికాస్ నానా మాటలు అన్నాడని భార్య ఆరోపించింది.

మీ నాన్న మాకు కారు ఇవ్వలేదు, డబ్బు ఇవ్వలేదు. అయినా నిన్ను ఇంత కాలం నిలబెట్టింది నా గొప్పతనం. ఇది నా స్వంత డబ్బుతో కొన్న కారు. అందుకే నిన్ను కిందకు దింపేసి బిడ్డను మాత్రమే తీసుకెళ్తానని తన భర్త వికాస్ చెప్పాడని ఆమె ఆరోపించింది.2020లో ఈ మహిళ నోయిడాకు చెందిన వికాస్ సోంకిని వివాహం చేసుకుని అతని జీవితంలోకి ప్రవేశించింది. మహిళ తల్లిదండ్రులు రూ. 12 లక్షల రూపాయలు ఖర్చు చేసి వికాస్ తో ఆమె పెళ్లి చేశారు.

పెళ్లి సమయంలో కట్నం రూపంలో కూడా డబ్బు ఇచ్చారని వికాస్ భార్య కుటుంబ సభ్యులు ఆరోపంచారు. అయితే పెళ్లయిన రోజు నుంచి భర్త వికాస్ అదనపు కట్నం ఇవ్వాలని అతని భార్యను వేధించేవాడని ఆరోపణలు ఉన్నాయి. తరువాత బిడ్డ పుట్టినా వికాస్ మాత్రం అతని భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడని అతని భార్య ఆరోపించింది. భర్త వికాస్ తల్లిదండ్రులు కూడా కారు కోసం, అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని భార్య ఫిర్యాదులో పేర్కొంది.

ఇదే విషయమై భర్త వికాస్ తండ్రి ముఖేష్, తల్లి సీమాదేవి, భర్త సోదరి శీతల్ భాటి తనను అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని మహిళ ఆరోపించింది. పోలీసులు చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. దీంతో ఆ మహిళ ఆమె భర్త వికాస్ తో పాటు అతని కుటుంబ సభ్యులపై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. కట్నం కోసం, కారు కోసం కట్టుకున్న భార్యను నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయిన భర్త వికాస్ కు పోలీసులు ఫుల్ క్లాస్ పీకారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+