భార్యను ఇట్లా చంపేసి అత్తకు ఎట్లా ఫోన్ చేశాడంటే, రెండు అంతస్తుల పైన !
మీ కూతుర్ని తనకు ఇచ్చి ఎలాగైనా పెళ్లి చెయ్యాలని ఓ యువకుడు ఆ యువతి కుటుంబ సభ్యలను ప్రాధేయపడ్డాడు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న అల్లుడు ఇప్పుడు అదే కూతురిని మెట్లపై నుంచి తోసేశాడని ఆ యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త అతని భార్యను పక్కాప్లాన్ తో హత్య చేశాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
వివాహం చేసుకున్న రెండు సంవత్సరాలకే కూతురు శవమై కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. వరకట్న వేధింపుల కారణంగా భార్యను ఆమె భర్త హత్య చేశాడు.
ఈ ఘటన బెంగళూరు నగరంలోని అడుగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తనీషా చౌదరి అనే చౌదరిని హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆమె భర్త తరుణ్ చౌదరి, అతని కుటుంబ సభ్యులు కలిసి ఆమెను హత్య చేశారని ఆరోపించారు.

తినీషా కుటుంబ సభ్యులు పరాయి రాష్ట్రంలో నివసిస్తున్నారు. బెంగళూరులో వ్యాపారం చేస్తున్న తరుణ్ చౌదరికి తన కుమార్తెను ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో పెద్దఎత్తున కట్నం డబ్బులు, పెళ్లికొడుకు తిరిగేందుకు విలాసవంతమైన కారు కూడా ఇచ్చామని తనీషా కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే బంగారు గుడ్లు పెట్టే కోడిని పెళ్లి చేసుకున్న తరుణ్ చౌదరి ఎక్కువ కట్నం తేవాలని భార్యను వేధించి ఇంకా డబ్బులు లాక్కోవాలని దురాశలో పడ్డాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.
బెంగళూరుకు చెందిన తరుణ్ చౌదరి అనే యువకుడు 2022లో తనీషా చౌదరిని వివాహం చేసుకున్నాడు. కూతురు తనీషా చౌదరి పెళ్లి తర్వాత ఆడుగోడి సమీపంలోని భర్త తరుణ్ ఇంట్లో ఉంటోంది. పెళ్లి సమయంలో కట్నం కింద డబ్బుతో పాటు కారు కట్నంగా ఇచ్చారు. అయితే భర్త తరుణ్ కుటుంబీకులు కూడా అదనపు కట్నం కోసం కూతురు తనీషాను వేధించారని ఆరోపణలు ఉన్నాయి. అల్లుడు తరుణ్ చౌదరి సోమవారం హఠాత్తుగా ఫోన్ చేసి మీకూతురు మేడమీద నుంచి పడిపోయిందని, మీరు త్వరగా బెంగుళూరుకు రండి అని చెప్పాడు.
మీ కూతురు తనీషా 50 మెట్లు పై నుంచి కింద పడిపోయిందని అల్లుడు తరుణ్ ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడు.
కర్ణాటక రాష్ట్రం బయట ఉన్న తనీషా తల్లిదండ్రులు తమ కుమార్తెకు ఆరోగ్యం బాగోలేదని భావించి బెంగళూరు చేరుకున్నారు. అయితే బెంగళూరుకు వచ్చిన తర్వాత కుమార్తె తనీషా మృతి చెందిన విషయం తెలిసింది. తనీషా డెడ్ బాడీని బెంగళూరు నగరంలోని సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో భద్రపరిచారు.
అంతేకాకుండా చనిపోయిన కుమార్తె తనీషా మెడపై గాయాల గుర్తులు కనిపించడంతో తనీషా కుటుంబీకులు మా కూతురిని తన భర్త తరుణ్ తో పాటు ఆమె కుటుంబీకులు వేధింపులకు గురిచేశారని, కట్నంతో హత్య చేశారని ఆరోపిస్తున్నారు.
మృతురాలు తనీషా తల్లిదండ్రులు ఆమె భర్త తరుణ్ చౌదరితో సహా ఏడుగురిపై వరకట్న వేధింపులు, హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడుగోడి పోలీస్ స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఆరోపణల నేపథ్యంలో తనీషా కుటుంబంపై కూడా విచారణ జరుగుతోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications