పామును గదిలో వదిలి... భార్య, బిడ్డని చంపిన భర్త...
భార్య మీద కోపంతో ఓ కసాయి భర్త ఎవరికి అనుమానం రాకుండా భార్య, తన రెండేళ్ల కుమార్తె నిద్రిస్తున్న సమయంలో గదిలోకి విషపూరితమైన పామును వదిలి వారిని చంపేసాడు. ఈ సంఘటన తాజాగా ఒడిశాలో చోటుచేసుకుంది. అయితే, పోస్టు మార్టం రిపోర్టులో పాము కాటుకు గురై చనిపోయారని తెలీనా, బాధితురాలి కుటుంబసభ్యులు అనుమానంతో పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. దీంతో భార్యను, కన్నకూతురిని కాటికి పంపిన ఆ వ్యక్తి కటకటాల పాలయ్యాడు.
ఈ ఘటన గంజాం జిల్లాలోని కబిసూర్యనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అధీగావ్‌కు చెందిన కె.గణేశ్ పాత్రాకు 23ఏళ్ల బసంతి పాత్రాతో 2020 లో వివాహం జరిగింది. వీరిద్దరికి రెండున్నరేళ్ల కుమార్తె కూడా ఉంది. ఆ చిన్నారి పేరు దేబాస్మిత. అయితే, వీరిద్దరూ తరచుగా చిన్న చిన్న విషయాలకే గొడవపడేవారు. భార్యతో గొడవల కారణంగా ఆమెను హత్య చేయాలని భావించించాడు భర్త గణేశ్. దాంతో తను హత్య చేసిన ఆ నేరం తనపైకి రాకుడదాని ఎంతో తెలివిగా ఓ పథకానికి శ్రీకారం చుట్టాడు.

విషపూరిత పాముతో భార్య, బిడ్డను చంపేశాడు : గణేష్ పాముతో భార్య, బిడ్డ ప్రాణాలు తీయాలనుకున్నాడు. అదే పనిని ఆచరణలో పెట్టాడు. పాములు పట్టే వ్యక్తి నుంచి ఓ విషపూరిత పామును సంపాదించి ఓ ప్లాస్టిక్ జార్‌లో అక్టోబరు 6న ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీసుకొచ్చాడు. ఆ సమయంలో అందరూ నిద్రావస్థలో ఉన్నారు. అయితే, ఆ పామును తీసుకెళ్లీ భార్య, కుమార్తె నిద్రపోతున్న గదిలో వదిలేశాడు. ఆ తర్వాత గణేష్ ఏమీ తెలియని వాడిలా వేరే గదిలోకెళ్లి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి భార్య, కుమార్తె ఇద్దరూ విగతజీవులై పడి ఉన్నారు. అయితే, అల్లుడి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన బసంతి పాత్రా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వారి గదిలోకి తానే స్వయంగా పామును వదిలినట్టు నిందితుడు అంగీకరించాడు. దాంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications