Wife: ఇద్దరూ ప్రభుత్వ స్కూల్ లో టీచర్ల, లేడీ టీచర్ కు అక్రమ సంబంధం ?, అర్దరాత్రి భార్య పక్కనే ?
రాత్రి దంపతులు ఇద్దరూ బెడ్ రూమ్ లో పక్కపక్కనే పడుకున్నారు. అర్దరాత్రి బయటకు వెళ్లిన భర్త పెద్ద బండరాయి ఎత్తుకుని వెళ్లి బెడ్ రూమ్ లో నిద్రిస్తున్న భార్య తల మీద వెయ్యడంతో లేడీ టీచర్ తల అర్దం పచ్చడి అయ్యింది.
బెంగళూరు/కలబురిగి: దంపతులు ఇద్దరూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులే. దంపతులకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భార్య శీలంపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. భర్త వేరే స్కూల్ లో, భార్య మరో స్కూల్ లో ఉద్యోగం చేస్తుండటంతో భర్తకు ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది. రాత్రి దంపతులు ఇద్దరూ బెడ్ రూమ్ లో పక్కపక్కనే పడుకున్నారు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్య తలపై పెద్ద బండ రాయి వేశాడు. పెద్ద బండా రాయి పడటంతో లేడీ టీచర్ తల అర్దం పచ్చడి అయ్యి ఆమె మెదడుతో పాటు రక్తం ఎగిరి బెడ్ రూమ్ లోని గొడ మీదపడి అక్కడే అతుక్కుపోయింది. లేడీ టీచర్ ను దారుణంగా చంపేసిన భర్త రాత్రి మొత్తం ఆమె శవం పక్కనే ఉండటం కలకలం రేపింది.

లేడీ టీచర్ పక్కనే పడుకున్నాడు
కర్ణాటకలోని కలబురగి నగరంలోని అంబికా నగర్ లో ఫరీదా బేగం (39), ఎజాజ్ అహ్మద్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఫరీదా బేగం, ఎజాజ్ దంపతులు ఇద్దరూ ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగాలు చేస్తున్నారు. రాత్రి ఎప్పటిలాగే దంపతులు పిల్లలతో కలిసి భోజనం చేశారు. పిల్లలు ఒకరూమ్ లో నిద్రపోయారు. ఫరీదా బేగం, ఆమె భర్త ఎజాయ్ మరో రూమ్ లోకి వెళ్లి పక్కపక్కనే పడుని నిద్రపోయారు.

అర్దరాత్రి నిద్రలేచిన శాడిస్టు భర్త ?
అర్దరాత్రి భార్య ఫరీదా బేగం పక్కనే నిద్రిస్తున్నట్లు నటించిన ఎజాయ్ చిన్నగా లేచి ఇంటి బయటకు వెళ్లాడు. తరువాత ముందుగా అక్కడ పెట్టిన పెద్ద బండరాయి ఎత్తుకుని బెడ్ రూమ్ లోకి వెళ్లి నిద్రిపోతున్న అతని భార్య ఫరీదా తలపై వేశాడు. పెద్ద బండరాయి తల మీద పడటంతో ఫరీదా బేగం తల సగం నుజ్జునుజ్జు అయ్యి ఆమె మెదడు సహా తలలోని ఇతర భాగాలు గోడకు ఎగిరిపడి అక్కడే అతుకున్నాయి. తీవ్ర గాయాలపాలైన లేడీ ఫరీదా బేగం భార్య రక్తపు మడుగులో కొట్టుముట్టాడుతూ అక్కడికక్కడే మృతి చెందింది.

భార్య శవం పక్కనే టైమ్ పాస్ చేసిన భర్త
తన భార్య ఫరీదా బేగం ప్రాణం పోయిందని నిర్దారించుకున్న ఎజాజ్ రాత్రంతా ఆమె మృతదేహం పక్కనే ఉంటూ ఉదయం వరకు టైమ్ పాస్ చేశాడు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో నిద్రలేచిన పిల్లలు కేకలు వేశారు. చుట్టుపక్కల ఉన్న బందులు విషయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు లేడీ టీచర్ ఫరిదా బేగం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

భార్యకు అక్రమ సంబంధం ఉందని ?
13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న ఎజాజ్, ఫరీదా బేగం సంతోంగా కాపురం చేశారు. దంపతులు ఇద్దరికి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు రావడంతో వారి సంసారం సాఫీగా సాగిపోయింది. అయితే తన భార్య ఫిరీదా బేగంకు అక్రమ సంబంధం ఉందని ఆమె భర్త ఎజాజ్ కు తెలిసింది. ఇదే విసయంలో నిత్యం ఎజాజ్ అతని భార్య ఫరీదాతో గొడవపడుతున్నాడు. ఫరీదా ఎవరికి ఫోన్ చేసినా ఆమె భర్త ఎజాజ్ అనుమానిస్తున్నాడు.

ప్రభుత్వ ఉద్యోగం నిలిపేయ్...... అంతే
పాఠశాలకు వెళ్లొద్దని పలుమార్లు లేడీ టీచర్ ఫరీదాను ఆమె భర్త ఎజాజ్ వేధతించాడని వెలుగు చూసింది. పరీక్షలు దగ్గర పడుతున్నాయని, పరీక్షలు అయ్యే వరకు స్కూల్ కు వెళ్లి పిల్లలకు చదువు చెప్పి వచ్చే సంవత్సరం ఉద్యోగం మానేస్తానని ఫరీదా ఆమె భర్త ఎజాజ్ కు చెప్పింది. భర్త సరే అని చెప్పకపోయినా ఫరీదా స్కూల్ కు వెళ్లి పిల్లలకు పాఠాలు చెబుతోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎజాజ్ అతని భార్య ఫరీదా తలపై బండరాయి వేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై కలబురిగి నగరంలోని స్టేషన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ప్రభుత్వ టీచర్ ఎజాజ్ మీద హత్య కేసు నమోదైంది.

రోడ్డున పడిన పిల్లలు
ఇంట్లో అమ్మా నాన్న ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులే కావడంతో ఇంతకాలం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎజాజ్, ఫరీదా దంపతుల ఇద్దరు పిల్లల చదువులు బాగానే కొనసాగాయి. ఇంట్లో తల్లిదండ్రులు తరుచూ గొడవపడుతుండటం చూసిన వారి పిల్లలు ఏమీ చెయ్యలేక మౌనం ఉన్నారు. అయితే ఇప్పుడు తల్లిని తండ్రి హత్య చేశాడు. హత్య కేసులో తండ్రికి జైలు శిక్ష పడుతుంది. అతని ప్రభుత్వ ఉద్యోగం కూడా పోతుంది. హాయిగా జీవితం గడిపి, మంచి భవిష్యత్తు కోసం కలలు కన్న పిల్లలు ఇప్పుడు అనాథలయ్యి రోడ్డున పడటంతో స్థానికులు చలించిపోతున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications