Bengaluru: భార్యకు హ్యాండ్ ఇచ్చాడు. ప్రియురాలికి ఫ్రూట్ ఇచ్చాడు. కొన్ని రోజులకే !
బెంగళూరు-రామనగర: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. భార్య ఏది అడిగినా ఉన్నంతలో తీసిస్తున్న భర్త ఆమెను సంతోషంగా చూసుకున్నాడు. భార్య కూడా ఆమె భర్త అంటే చాలా గౌరవం ఇచ్చేది. భర్తకు ఓ యువతి పరిచయం అయ్యింది. రానురాను ఇద్దరూ దగ్గర అయ్యారు. వివాహం అయిన వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియురాలి మోజులో పడిపోయిన భర్త అతని భార్యను నిర్లక్షం చేశాడు. ఇటీవల భార్యను గాలికి వదిలేసిన భర్త అతని ప్రియురాలితో పారిపోయాడు. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న యువకుడు చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించడం కలకలం రేపింది.

ఆరు ఏళ్ల క్రితం పెళ్లి
నగేష్ నే యువకుడు ఆరు సంవత్సరాల క్రితం మధుశ్రీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న నాగేష్ అతని భార్య మధుశ్రీతో సంతోషంగా కాపురం చేశాడు. నాగేష్, మధుశ్రీ దంపతులు బెంగళూరులోని వీరభద్రనగర్ లో కాపురం ఉంటున్నారు. మధుశ్రీ ఏది అడిగినా ఆమె భర్త నాగేష్ కాదనకుండా తీసిస్తూ ఆమెను సంతోంగా చూసుకున్నాడు. మధుశ్రీ కూడా ఆమె భర్త నాగేష్ మీద చాలా ప్రేమ చూపించింది.

సహనా ఎంట్రీ.... అక్రమ సంబంధం
నాగేష్ కు గత ఏడాది సహనా అనే యువతి పరిచయం అయ్యింది. వీరభధ్రనగర్ లోనే నివాసం ఉంటున్న సహనాతో నాగేష్ అప్పుడప్పుడు మాట్లాడేవాడు. రానురాను ఇద్దరు సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. నాగేష్ కు వివాహం అయ్యిందని తెలిసినా సహనా అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. సహనాతో అక్రమ సంబంధం పెట్టుకున్న నాగేష్ ఆమె మోజులో పడిపోయి అతని భార్య మధుశ్రీ గురించి పట్టించుకోవడం మానేశాడు.

భార్యను గాలికి వదిలేసి ప్రియురాలితో జంప్
ఫిబ్రవరి 10వ తేదీన నాగేష్ అక్రమ సంబంధం పెట్టుకున్న అతని ప్రియురాలు సహానాతో కలిసి పారిపోయాడు. తన కూతురు కనపడటం లేదని సహనా తండ్రి కుంబలగూడు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. అప్పటి నుంచి నాగేష్, సహనా కోసం పోలీసులు గాలిస్తున్నారు. తన భర్త నాగేష్ ప్రియురాలితో లేచిపోయాడని తని భార్య మధుశ్రీ ఆవేదనతో కులిమిపోయి పుట్టింటికి వెళ్లిపోయింది.

ప్రియురాలిని వదిలేసి ఆత్మహత్య
ఆదివారం రాత్రి విశ్వేశ్వరయ్య లేఅవుట్‌లోని నిర్జన ప్రాంతంలో చెట్టుకు వేలాడుతున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ప్రజలు ఇచ్చిన సమాచారంతో జ్ఞానభారతి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు పోలీసుల విచారణలో వీరభధ్రనగరలో నివాసం ఉంటున్న నాగేష్ ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగులోకి వచ్చింది. అయితే భార్యను వదిలేసి ప్రియురాలు సహనాతో పారిపోయిన నాగేష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు ఆరా తీస్తున్నారు, నాగేష్ భార్య మధుశ్రీ, నాగేష్ ప్రియురాలు సహనాను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని సోమవారం పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications