గర్బవతి మీద అత్యాచారం చేసిన భర్త, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన భార్య !
ఒడిశా/భువనేశ్వర్: భార్య ఆశా వర్కర్ గా ఉద్యోగం చేస్తోంది. కామాంధుడైన భర్త పక్కింటిలో నివాసం ఉంటున్న దూరపు బంధువు మీద కన్ను వేశాడు. భర్త కోరిక తెలుసుకున్న భార్య అతన్ని మందలించకుండా నీ కోరిక నేను తీరుస్తానని భర్తకు మాట ఇచ్చింది. గర్బవతి అయిన మహిళ మీద భర్త లైంగిక దాడి చేస్తుంటే వీడియో తీసిన భార్య శాడిస్టులాగా ప్రవర్తించింది. చివరికి ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.

భార్య ఆశా వర్కర్
ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లా జగన్నాథ్‌పూర్ గ్రామంలో లాలియా రుంజికర్ అలియాస్ లాలియా (38) అనే కామాంధుడు నివాం ఉంటున్నాడు. లాలిలాయాకు పద్మా (35) అనే భార్య ఉంది, ఆరోగ్య శాఖలో పధ్మా ఆశా వర్కర్ గా ఉద్యోగం చేస్తోంది. దంపతుల పక్కింటిలో పద్మ చెల్లెలి వరుస అయ్యే మహిళ నివాసం ఉంటున్నది. పధ్మా బంధువు 5 నెలల గర్భిణి.

పక్కింటి గర్బవతి మీద భర్త కన్నుపడింది
ఫిబ్రవరి 28వ తేదీన సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం రావాలని పద్మా ఆమె బంధువుకు ఫోన్ చేసింది. పద్మా కొడుకు ఆమెను బైక్ లో ఎక్కించుకుని ఓ ప్రాంతంలో దించాడు. అప్పటకే అక్కడ ఉన్న పద్మా, ఆమె భర్త లాలియా గర్బవతి అయిన మహిళను బలవంతంగా ఓ ఇంటికి తీసుకెళ్లారు. మహిళను ఇంట్లోకి లాక్కెళ్లి గర్భిణిపై పద్మా భర్త లాలియా అత్యాచారానికి పాల్పడ్డాడు.

భర్త రేప్ చేస్తుంటే వీడియో తీసిన భార్య
భర్త లాలియా గర్బవతి మీద అత్యాచారం చేస్తున్న సమయంలో ఆశా వర్కర్ పద్మా ఆమె సెల్‌ఫోన్‌లో వీడియో తీసింది. ఈ విషయం బయటకు చెబితే నీ రేప్ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని లాలియా, పధ్మా దంపతులు ఆమెను బెదిరించారు. బాధితురాలు తీవ్ర శారీరక, మానసిక వేదనకు గురైంది, చివరికి కామాంధుదు లాలియా గర్బవతి మీద రేప్ చేసే సమయంలో భార్య తీసిన వీడియోను సోల్ మీడియాలో పోస్టు చేశాడు.

శాడిస్టు ఆశా వర్కర్ అందర్
గర్బవతి లైంగిక దాడి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. బంధువులు గర్బవతిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. తరువాత బంధువులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. గర్బవతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాలియా, అతని భార్య పధ్మాలను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. వ్యక్తిగత, కుటుంబ కలహాల కారణంగా ఇంత జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications