Wife: అక్రమ సంబంధం పంచాయితీ, జస్ట్ గ్యాస్ లీక్ చేసి ఇంటికే నిప్పు పెట్టిన భర్త, పక్కింటోళ్లు!
భార్యాభర్తలు నిద్రపోయే వరకు అక్రమ సంబంధం వియషంలో గొడవలుపడ్డారు. అప్పుడు రగిలిపోయిన భర్త అతని భార్యతో గొడవ పడి విసిగిపోయి ఇంటిని కాల్చి బూడిద చేశాడు.
లక్నో/ఘాజియాబాద్: భార్యాభర్తలు నిద్రపోయే వరకు అక్రమ సంబంధం వియషంలో గొడవలుపడ్డారు. భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవ తారాస్థాయికి చేరింది. అప్పుడు రగిలిపోయిన భర్త అతని భార్యతో గొడవ పడి రగిలిపోయాడు. గొడవ ఎక్కువ కావడంతో భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. అంతే భర్త అతని ఇంటికి నిప్పు పెట్టాడు. ఆ సమయంలో దంపతులకు సాయం చేసేందుకు వచ్చిన ఇరుగుపొరుగు వారితోపాటు మొత్తం 10 మంది మంటల్లో గాయపడ్డారు.

వితంతువుతో అక్రమ సంబంధం
ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లోని తిలక్ నగర్ కాలనీకి చెందిన సురేష్ కు రీతూ ( 36) అనే భార్య ఉంది. రాత్రి భార్య రీతూతో సురేష్ గొడవ పడ్డాడు. భర్త సురేష్ అక్రమ సంబంధంపై అతని భార్య రీతూ ప్రశ్నించింది. అదే ప్రాంతంలో ఓ వితంతువుతో తన భర్త సురేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రీతూ ఆరోపించింది. దీనిపై ఆమె చాలాసార్లు హెచ్చరించింది.

దంపతుల మధ్య గొడవలు
ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అంతకుముందు అవమానంతో సురేష్ అతని భార్య రీతూ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎక్కువ మాట్లాడితే నిన్నుచంపేస్తానని సురేష్ అతని భార్య రీతూను బెదిరించాడు. సురేష్ కోపం నశాలానికి ఎక్కింది. నేరుగా వంటగదిలోని గ్యాస్ సిలిండర్ పైప్ తీసి గ్యాస్ ఆన్ చేశాడు.

గ్యాస్ సిలిండర్ లీక్ చేసి నిప్పంటించాడు
కొద్ది క్షణాల్లోనే ఇంట్లోకి గ్యాస్ వ్యాపించింది. భయాందోళనకు గురైన రీతూ సహాయం కోసం కేకలు వేసింది. రీతూ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చారు. సురేష్ కోపం చల్లారకుండా మరింత పెరిగింది. ఇరుగుపొరుగు వారు గొడవకు దిగడంతో ఆగ్రహం చెందిన సురేష్ అతని ఇంటికి నిప్పంటించాడు.గ్యాస్ లీక్ కావడంతో ఇంట్లో మంటలు చెలరేగడంతో పాటు గ్యాస్ సిలిండర్ పేలిపోయింది.

తిక్కలోడు ఎంతపని చేశాడు?
దీంతో సురేష్ భార్య రీతూకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో మొత్తం 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో చేర్పించారు. సురేష్ కుటుంబ సభ్యులే అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కేసు పోలీస్ స్టేషన్‌కు చేరింది. సురేష్ మీద అక్రమ సంబంధం, గృహహింస, భార్యపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. సాయం చేసేందుకు వచ్చిన ఇరుగుపొరుగు వారికి కూడా గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications