Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: భార్య నిద్రపోతే అర్దరాత్రి పోర్న్ వీడియోలు చూస్తున్న భర్త, ఆ వీడియోలు కోసం ఏం చేశాడంటే?

అర్దరాత్రి దాటిన తరువాత కూడా పోర్న్ వీడియోలు చూడటంపై భార్యాభర్తల మధ్య గొడవలు మొదలై భార్య హత్యకు దారితీసిన ఘటన కలకలం రేపింది.

అహమ్మదాబాద్/గుజరాత్: భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరగడం మామూలే. కట్నం కోసం, ఇంటి పనులు సక్రమంగా చెయ్యడంలేదని తదితర విషయాల్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు భార్యాభర్తలు తీవ్రమైన సమస్యలపై గొడవ పడుతుంటారు.

విషయం విడాకుల వరకు దారి తీస్తుంది. కొన్నిసార్లు అక్రమ సంబంధం విషయాల్లో గొడవలు జరిగి హత్యలతో ముగుస్తుంది. అయితే అర్దరాత్రి దాటిన తరువాత కూడా పోర్న్ వీడియోలు చూడటంపై భార్యాభర్తల మధ్య గొడవలు మొదలై భార్య హత్యకు దారితీసిన ఘటన కలకలం రేపింది.

పోర్న్ వీడియోలు చూస్తున్న భర్త

పోర్న్ వీడియోలు చూస్తున్న భర్త

గుజరాత్ లోని సూరత్ లోని కతరగాం ప్రాంతంలో కిషోర్ పటేల్ (33) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కాజల్ (30) అనే యువతిని కిషోర్ వివాహం చేసుకున్నాడు. కిషోర్ రాత్రిపూట ఎక్కువగా మొబైల్‌లో ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తున్నాడు. ఇది గమనించిన భార్య కాజల్ ఇలాంటి పోర్న్ వీడియోలు చూడటం మానేయాలని ఆమె భర్త కిషోర్ కు చాలాసార్లు సూచించింది.

చెప్పినా మాట వినని భర్త

చెప్పినా మాట వినని భర్త

అయితే కిషోర్ మాత్రం పోర్న్ వీడియోలను అర్దరాత్రి దాటిన తరువాత కూడా చూస్తూనే ఉన్నాడు. ఇదే విషయంలో కిషోర్, కాజల్ దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. అర్దరాత్రి కిషోర్ అతని భార్య కాజల్ నిద్రపోయిన తరువాత మొబైల్ చేతిలో పట్టుకుని పోర్న్ వీడియోలు చూస్తున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజు కూడా ఇదే విషయమై కిషోర్, కాజల్ దంపతుల మధ్య పెద్దగా గొడవ జరిగింది.

నిప్పంటించి చంపేసిన భర్త

నిప్పంటించి చంపేసిన భర్త

ఈ సమయంలో కిషోర్, కాజల్ దంపతుల మధ్య వాగ్వాదం చెయ్యిచెయ్యి చేసుకునే వరకు వెళ్లింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన కిషోర్ అతని భార్య కాజల్ కు నిప్పంటించాడు. మంటల్లో కాలిపోయిన కాజల్ ను మొదట స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్సకు స్పందించకపోవడంతో కాజల్ తుది శ్వాస విడిచింది. మరణానికి ముందు కాజల్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. పోర్న్ వీడియోలు చూడకూడదు అని చెప్పిన దానికి తన భర్త కిషోర్‌ తనకు నిప్పంటించాడని కాజల్ పోలీసులకు చెప్పింది.

కిరాతకుడు అరెస్టు

కిరాతకుడు అరెస్టు

కిషోర్ మీద హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు కిషోర్ గుజరాత్‌లోని పఠాన్‌కు చెందినవాడు. కాజల్ స్వస్థలం ముంబాయి. వీరిద్దరూ ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నారు. ముంబయిలోని డైమండ్ జ్యూయలరీ ఫ్యాక్టరీలో కలిసి పనిచేస్తున్నప్పుడు కాజల్, కిషోర్ కు పరిచయం కావడం, తరువాత ప్రేమించుకోవడంతో పెళ్లి చేసుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

కాజల్ కు రెండో పెళ్లి

కాజల్ కు రెండో పెళ్లి

ఇరు వైపుల కుటుంబసభ్యుల అంగీకారంతో కాజల్, కిషోర్ పెళ్లి చేసుకున్నారని పోలీసులు చెప్పారు. అయితే కాజల్‌కు గతంలో పెళ్లి అయ్యిందని, ఆమె మొదటి భర్త 5 సంవత్సరాల క్రితం మరణించాడని, తరువాత కిషోర్ ను పెళ్లి చేసుకుందని పోలీసులు తెలిపారు. వివాహం చేసుకున్న తరువాత కాజల్, కిషోర్ దంపతులు చాలా సంతోషంగానే ఉన్నారని, పోర్న్ వీడియోలు చూసే విషయంలోలోనే ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+