బాలీవుడ్‌ను హిందుఫోబియా చుట్టుముట్టిందా?: ఆ సినిమాల అంతరార్థమేంటీ?

ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమ.. బాలీవుడ్. దేశంలో విభిన్న కథలు, సంస్కృతులకు పెట్టింది పేరు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ మూవీల్లో హిందుఫోబియా ఓ సర్వసాధరణమైనట్టు కనిపిస్తోంది. ఈ వైఖరి క్రమంగా ఆందోళనకంగా మారుతోంది. హిందూ సమాజంలో వారి మతం, సంస్కృతిపై ఆయా సినిమాల చిత్రీకరణ కలవరపాటుకు గురి చేస్తోంది.

హిందూ పాత్రలు, చిహ్నాలు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా, హిందువుల మనుభావాలను కించపరిచేలా సన్నివేశాలను తెరకెక్కించడం రోజువారీ తతంగంగా మారింది బాలీవుడ్‌లో. హిందూయిజానికి వ్యతిరేకంగా సినిమాలను చిత్రీకరించాలనే ఓ అవాంఛనీయ ట్రెండ్ ఇప్పుడు బాలీవుడ్‌లో నెలకొందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

The IC 814 Controversy Depiction of Hindu characters and traditions in a negative light in Bollywood

హిందూ సంస్కృతిని కించపరిచే రీతిలో సన్నివేశాలను తెరకెక్కించడం బాలీవుడ్‌కు కొత్తమీ కాదు. ఇటీవలి కాలంలో దీని తీవ్రత పెరిగినట్లు కనిపిస్తోంది. 2012లో వచ్చిన ఓ మై గాడ్, 2014లో విడుదలైన పీకే వంటి సినిమాలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

హిందువుల ఆచారాలను ప్రశ్నించడం, కామెడీ పేరుతో అపహాస్యం చేయడం వంటి కారణాల వల్ల ఈ రెండు సినిమాలు అప్పట్లో వివాదానికి కేంద్రబిందువు అయ్యాయి.

ఇటీవలే విడుదలైన ఐసీ 814- ది కాందహార్ హైజాక్ కూడా ఈ జాబితాలో చేరింది. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్‌ను నాటకీయంగా చూపించడం ఈ వివాదాస్పద ధోరణికి తాజా ఉదాహరణగా నిలిచింది. హైజాకింగ్‌లో పాల్గొన్న ఉగ్రవాదులకు హిందువుల పేర్లు పెట్టారు. ఇది వివాదానికి దారి తీసింది. హిందువుల పేర్లు పెట్టడం వెనుక గల ఉద్దేశాలు ఏమిటనేది చర్చనీయాంశమైంది.

ఐసీ 814 ఫ్లైట్ నిజ జీవితలో హైజాకర్లు కరడుగట్టిన ఇస్లామిస్ట్ టెర్రరిస్టులు. అయినప్పటికీ సినిమా ఆ పాత్రలకు హిందూ పేర్లు పెట్టడం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమే కాకుండా, హిందూ సమాజాన్ని కించపరిచే ప్రయత్నంగా విమర్శకులు అభివర్ణిస్తోన్నారు.

ఐసీ 814లో ఉగ్రవాదులకు హిందూ పేర్లను పెట్టడం అనేది యాదచ్ఛికంగా జరగలేదు. బాలీవుడ్‌ సినిమాల్లో హిందూ చిహ్నాలు, బొమ్మలు తరచుగా కోట్లాదిమంది హిందువుల మనోభావాలకు భిన్నంగా, వ్యతిరేక వాతావరణంతో ముడిపడి ఉంటాయి. ఈ ధోరణి హిందుయిజం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెంపొందిస్తుందని, ఒక హానికరమైన మూస పద్ధతులకు పునాదులు వేస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు.

దేశ ప్రజల సెంటిమెంట్ పట్ల సున్నితంగా వ్యవహరిస్తామంటూ నెట్‌ఫ్లిక్స్ ఇటీవల ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో హామీ ఇచ్చినప్పటికీ అది ప్రశ్నగానే మిగిలి పోయింది. బాలీవుడ్ చిత్రాలలో హిందువులను విలన్‌లుగా లేదా తీవ్రవాదులుగా చిత్రీకరించడం ఆ సమాజ విస్తృత సామాజిక ప్రయోజనాలను దెబ్బతీయడమేననే అభిప్రాయాలు బలంగా వినిపిస్తోన్నాయి.

ఇది హిందూ సమాజంలో పరాయీకరణకు బీజం వేస్తుందని, ధ్వేషాన్ని పెంపొందిస్తుందనే అభిప్రాయాలు లేకపోలేదు. అంతేకాకుండా లౌకిక, సమ్మిళిత విలువలపై నిర్మితమైన దేశంలో విభజన వాతావరణానికి ఆజ్యం పోస్తుంది. 2018లో వచ్చిన పద్మావత్ వంటి సినిమాలు హిందూ రాజ్‌పుత్ యోధుల పాత్రలు విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

పద్మావత్ మూవీ- హైందవ వీరుల పరాక్రమం, గౌరవాన్ని అణగదొక్కేలా ఉందంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. అదేవిధంగా శాక్రేడ్ గేమ్స్ (2018) అనే వెబ్ సిరీస్‌లో.. త్రిశూలం, భగవద్గీత వంటి హిందూ చిహ్నాలను కించపరిచేలా, తప్పుదారి పట్టించేలా సన్నివేశాలను చిత్రీకరించారనే వాదనలు ఉన్నాయి.

ఇతర మతాల జోలికి వెళ్లకుండా హిందూ సంప్రదాయాలను మాత్రమే ఎంపిక చేసుకోవడం ద్వారా బాలీవుడ్‌లో నెలకొన్న హిందూ ఫోబియాను ఎదుర్కొనాల్సిన పరిస్థితులు దేశంలో తలెత్తాయని అంటున్నారు. ఇది కేవలం సృజనాత్మక స్వేచ్ఛకు సంబంధించిన విషయం కాదని, అన్ని వర్గాల సున్నితత్వాన్ని గౌరవించే బాధ్యతగా సినిమాలను తెరకెక్కించాల్పిన అవసరం ఉందనే అభిప్రాయాలును బలంగా వ్యక్తీకరించడమే ఈ కథనం ఉద్దేశం.

బాటమ్‌లైన్: బాలీవుడ్‌లో హిందూ పాత్రలు, సంస్కృతిని చిత్రీకరించే విషయంలో మరింత సంయమనం, సమతౌల్యం అవసరం. ఏ మతంలోనైనా ఆచారాలను విమర్శించడం, ప్రశ్నించడం ముఖ్యమే అయినప్పటికీ, అది గౌరవాన్ని పెంపొందించేలా, న్యాయబద్ధంగా, అందరూ సమర్థించేలా ఉండాలి.

ఐసీ 814: ది కాందహార్ హైజాక్, ఇతర సినిమాల్లో కనిపించే విధంగా హిందూమతాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం సామాజిక విభజనలను మరింతగా పెంచడానికి, అనారోగ్యకరమైన వాతావరణానికి తెర తీయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఐసీ 814 వెబ్ సిరీస్‌పై నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ చీఫ్‌కు కేంద్ర ప్రభుత్వం సమన్లు ఇచ్చింది.

నిజానికి దేశ వైవిధ్యాన్ని బాలీవుడ్ నిజంగా తెరకెక్కించాలనుకుంటే అన్ని సామాజిక వర్గాలు, మతాల వారికి సమానమైన గౌరవం దక్కేలా చూసుకోవాలి. ప్రజలను ఎంతగానో ప్రభావితం చేయగల మాధ్యమం కావడం వల్ల అంతే శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది సినిమా. అలాంటి రంగంలో నెలకొన్న పక్షపాత వైఖరిని శాశ్వతంగా దూరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

బాలీవుడ్‌లో హిందూఫోబియాపై ఒకవంక చర్చ కొనసాగుతుండగా.. అదే సమయంలో చిత్రనిర్మాతలు తమ కథా కథనంలో మరింత నిష్పక్షపాతంగా వ్యవహరించడం చాలా కీలకం. ఇది అన్ని మత విశ్వాసాలను కలుపుకొని పోవడం, అందరినీ గౌరవించే వాతావరణానికి దోహదపడుతుంది.

దశాబ్దాలుగా హిందువులను ఉద్దేశపూర్వకంగా కించపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన అనేక బాలీవుడ్ సినిమాల్లో కొన్నింటిని ఈ క్రింది ట్వీట్‌లో చూడొచ్చు. ఇది కేవలం యాదృచ్చికమా, సృజనాత్మక స్వేచ్ఛ లేక ఉద్దేశపూర్వకంగా చేసిన పన్నాగమా అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రేక్షకులే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+