ఇది దెబ్బ: దినకరన్ టార్గెట్: ఆర్ కే నగర్ లో ఐటీ శాఖ దాడులు !
శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్న ఆర్ కే నగర్ నియోజక వర్గంపై ఎన్నికల కమిషన్ అధికారులు డేగ కన్ను వేశారు. ఆర్ కే నగర్ లో నివాసం ఉంటున్న దినకరన్ అనుచరుడు రామచంద్రన్ ఇంటిపై ఐటీ శాఖ అధికారు
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏఐఏడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్థి టీటీవీ దినకరన్ పై ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తున్న దినకరన్ ప్లాన్ లు బెడిసికొడుతున్నాయి.
దినకరన్ అనుచరుడు, శశికళ వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ నాయకుడు అయిన ఆర్ కే నగర్ నివాసి రామచంద్రన్ ఇంటిపై సోమవారం ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడి చేశారు. రామచంద్రన్ ఇంటిలో సోదాలు చేస్తున్నారు.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా దినకరన్ అనుచరులు ఇష్టం వచ్చినట్లు నగదు, విలువైన బహుమతులు పంచిపెడుతూ ఓటర్లను మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అక్కడ పోటీ చేస్తున్న ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
ఈ నేపధ్యంలో ఆదాయపన్ను శాఖ అధికారులు దినకరన్ అనుచరుల మీద ప్రత్యేక దృష్టిసారించారు. రామచంద్రన్ ఇంటిలో పలు డాక్యుమెంట్లు పరిశీలించి అతన్ని విచారిస్తున్నారు. రామచంద్రన్ ను ఐటీ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఆర్ కే నగర్ నియోజక వర్గంలోని ప్రజలకు డబ్బు, విలువైన బహుమతులు పంచిపెడుతున్న దినకరన్ అనుచరులు శివకుమార్, ప్రసన్న, కరుణమూర్తి అనే ముగ్గురు ఇప్పటికే అరెస్టు అయ్యారు. ఇప్పుడు రామచంద్రన్ ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చెయ్యడంతో దినకరన్ అనునచరులు హడలిపోతున్నారు.












Click it and Unblock the Notifications