నిపా వైరస్‌కు మందు ఉంది!: హోమియోపతి వైద్యులు, ఈ వైరస్‌కు కారణం గబ్బిలాలు కాదు
న్యూఢిల్లీ: నిపా వైరస్‌కు మెడిసిన్ ఉందని ఇండియన్ హోమియోపతి మెడికల్ అసోసియేషన్ - కేరళ యూనిట్ తెలిపింది. అన్ని రకాల జ్వరాలకు అవసరమైన మందులు ఉన్నాయని, కానీ వ్యాధి కలిగిన పేషెంట్లకు చికిత్స అందించేందుకు తమను అనుమతించాలన్నారు. ఈ మేరకు వారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రికి ఓ విజ్ఞప్తి చేశారు. పేషెంట్లను పరీక్షించేందుకు తమ వైద్య నిపుణులకు అనుమతివ్వాలని కోరారు.
నిపా వైరస్ కేవలం అంతటా భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే దాని దాటికి కేరళలో 17 మంది వరకు మృతి చెందారు. కానీ దీని విజృంభనకు సరైన కారణాలు నిర్ధారించలేకపోతున్నారు. అయితే నిపా వైరస్ బయటపడిన వెంటనే దానికి పండ్లపై వాలే గబ్బిలాలు(ఫ్రూట్ బ్యాట్) కారణమనే వార్తలు వినిపించాయి. దీనిపై కేరళ చర్యలు కూడా తీసుకుంది.

ఈ నేపథ్యంలో ఈ ఫ్రూట్ బ్యాట్లకు చెందిన 13 నమూనాలను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్(ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)కు పంపారు. ఈ నమూనాలను పరీక్షించిన ఈ సంస్థ వీటిలో నిపాను కలిగించే లక్షణాలు లేవని తేల్చారు. దీంతోపాటు ఎలుకల నమూనాలను కూడా పరీక్షించినా, నిపా వైరస్ వ్యాప్తి లక్షణాలు లేవని తేలింది. పందులు, మేకలు, గేదెలు వంటి పశువుల నమూనాల్లోనూ నెగటివ్ అనే వచ్చింది.
దీనిపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ మాట్లాడారు. నిపా వైరస్ కారకాలుగా అనుమానించిన అన్ని నమూనాలను ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీకు పంపామని, అన్నింట్లోనూ నెగటివ్ అనే తేలిందని, దీంతో నిఫా వైరస్ వ్యాప్తికిగల కారణాన్ని అన్వేషించడానికి మరో ప్రయత్నం మొదలు పెట్టామని, త్వరలోనే దీనికి గల కారణాలు కనుక్కొని సమూలంగా నియంత్రిస్తామన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications