దిగొచ్చిన సిద్ధరామయ్య: రవి మృతి కేసును సిబిఐకి అప్పగిస్తూ ప్రకటన

బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి (36) అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. సోమవారం ఉదయం 11.35 గంటల సమయంలో శాసన సభ సమావేశాల్లో సిద్దరామయ్య ఈ ప్రకటన చేశారు. ఇదే సమయంలో ఐఏఎస్ అధికారి రవి పనితీరుపై సిద్దరాయ్య స్పందించారు.

ఐఏఎస్ అధికారి డి.కే. రవి పని తీరు చాలా బాగుందని కితాబు ఇచ్చారు. ఆయన కోలారుతో పాటు బెంగళూరులో పని చేసి ప్రభుత్వానికి పూర్తిగా సహకరించారని చెప్పారు. గత సోమవారం ఆయన మరణించారని గుర్తు చేశారు. ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయని అన్నారు.

కర్ణాటక పోలీసులు, సీఐడి పోలీసులు అనేక క్లిష్టమైన కేసులు చాకచక్యంగా దర్యాప్తు చేశారని అన్నారు. వారి ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదనే కారణంతోనే తాను మొదట ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించడానికి అంగీకరించలేదనిచెప్పారు. అంతే గానీ తాను ఎక్కడా సీబీఐని వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. రవి మరణానికి గల కారణాలు బయటకు వస్తాయని సిద్దరామయ్య చెప్పారు.

The investigations into the death of IAS officer D.K Ravi will be probed by the CBI.

తాను రవి కేసు వ్యవహారాన్ని రాజకీయం చెయ్యలేదని, అంత అవసరం తనకు రాలేదని సిద్దరామయ్య అన్నారు. అంతకు ముందు సిద్దరాయ్య తన మంత్రి వర్గంతో రవి కేసు విషయంపై సుధీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడం, అధిష్టానం కేసు దర్యాప్తు సీబీకి అప్పగించాలని సూచించడంతో సిద్దరామయ్య మంత్రుల నిర్ణయం అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని నిర్ణయించారు.

సిద్దరామయ్య తీసుకున్న నిర్ణయాన్ని శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ స్వాగతించారు. అయితే ఒక్కవారం రోజుల పాటు సాగదియ్యడం బాధ కలిగించిందని చెప్పారు. సీబీఐ అధికారులు డికే. రవి మృతి కేసు దర్యాప్తు త్వరలో ఛేదిస్తారని జగదీష్ శెట్టర్ అన్నారు. అయితే ఇప్పటికే రవి కేసులో సాక్ష్యాలు నాశనం చేశారని బీజేపీ, జేడీఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిచాలని బెంగళూరులో ధర్నా నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ బీ.ఎస్ యడ్యూరప్ప తదితరులు ధర్నా విరమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+