మాజీ సీఎం సంచలన నిర్ణయం, గుండెకు చికిత్స చేసిన తర్వాత?, మాజీ ప్రధాని ఏం చెప్పారంటే!
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు కర్ణాటకలో మహాకూటమిగా ఏర్పడిన బీజేపీ, జేడీఎస్‌లు 28 లోక్ సభ నియోజక వర్గాలను బీజేపీ 25, జేడీఎస్ మూడు నియోజకవర్గాలు పంచుకున్నాయి. జేడీఎస్ ఎట్టకేలకు మూడు లోక్ సభ నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసింది. 28 నియోజకవర్గాలు కోలార్, మండ్య, హాసన్ లోక్‌సభ నియోజకవర్గాల జేడీఎస్ అభ్యర్థులు ఖరారైనారు.
మూడు నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను జేడీఎస్ పార్టీ హైకమండ్ విడుదల చేసింది. ముందుగా ఊహించినట్లుగానే ప్రజ్వల్ రేవణ్ణ హాసన్‌లో పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే కోలార్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎవ్వరూ ఊహించని విధంగా జేడీఎస్ అభ్యర్థి బరిలోకి దిగి అందర్ని ఆశ్చర్య పరిచారు.

కోలార్ లోక్ సభ నియోజకవర్గంలో సమృద్ధి మంజునాథ్, నిసర్గ నారాయణస్వామి చివరి నిమిషం వరకు కోలార్ లోక్ సభ నియోజకవర్గం టికెట్ కోసం పోటీపడ్డారు. అయితే చివరి క్షణంలో మల్లేష్ బాబు కోలారు లోక్ సభ టిక్కెట్ ఇప్పించుకున్నారు. అయితే సమృద్ధి మంజునాథ్ పేరు చివరి క్షణం వరకు ముందు వరుసలో ఉంది. అయితే ఎట్టకేలకు దళపతులు జేడీఎస్ నాయకుడు మల్లేష్ బాబుకు టికెట్ ఇచ్చారు.
జేడీఎస్ నేతలకు ప్రతిష్టాత్మకమైన మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి నిఖిల్ కుమారస్వామి లేదా హెచ్‌డీ కుమారస్వామి పోటీ చేయాలని మండ్య జిల్లాకు చెందిన నాయకులు, నేతలు డిమాండ్ చేశారు. కాగా, జేడీఎస్ నేత సీఎస్ పుట్టరాజును మండ్యలో బరిలోకి దింపుతామని కుమారస్వామి తెలిపారు. అయితే కుమారస్వామి పోటీ చేయాలని మండ్య జేడీఎస్ కార్యకర్తలు పట్టుబట్టారు.
మాజీ షీఎం కుమారస్వామి చెన్నపట్టణను వదిలి మండ్యకు వెళ్లవద్దని చెన్నపట్టణ కార్యకర్తలు పట్టుబట్టారు. అయితే ఎట్టకేలకు కుమారస్వామి మండ్య కార్యకర్తల ఒత్తిడికి తలొగ్గి పోటీకి అంగీకరించారు. ఇప్పటికే హాసన్‌లో మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ మాట్లాడుతూ కుమారస్వామిని మండ్య ప్రజలు పోటీ చెయ్యాలని పట్టుబడుతున్నారని, ఆయన్ను వాళ్లు వదలడం లేదని అన్నారు. మండ్య జిల్లా జేడీఎస్ నాయకులు, కార్యకర్తల ఒత్తిడితో కుమారస్వామి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications