జయలలితకు మళ్లీ కష్టాలు: కేసు అప్పీల్‌కు ఆచార్య పట్టు

బెంగళూరు: అక్రమ ఆస్తుల కేసులో న్యాయస్థానం నుండి క్లీన్ చిట్ తీసుకున్నతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలితకు మళ్లీ కష్టాలు మొదలు అయ్యేటట్లు ఉన్నాయి. ఈ అక్రమ ఆస్తుల కేసు తీర్పును ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చునని కర్ణాటక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.వి. ఆచార్య అంటున్నారు.

జయలలిత కేసు తీర్పును ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్దామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.వి. ఆచార్య కర్ణాటక ప్రభుత్వానికి లేఖ వ్రాశారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రశ్నించడానికి ప్రభుత్వానికి చాలా అవకాశాలు ఉన్నాయని ఆయన కర్ణాటక ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు.

the Karnataka government to file an appeal in the J.Jayalalithaa case ?

జయలలిత అక్రమ ఆస్తుల కేసులో కర్ణాటక హై కోర్టు బ్యాంకు లావాదేవీల లెక్కలను సక్రమంగా చూడలేదని, కొన్ని పొరపాట్లు జరిగాయని ఆచార్య అంటున్నారు. కర్ణాటక హైకోర్టు జయలలిత బ్యాంకు లావాదేవీల లెక్కలను సరిగ్గా చూడలేదని, వాటిని లెక్కించడంలో పొరపాట్లు జరిగాయని చెబుతున్నారు.

జయలలిత కేసులో ప్రతివాదిగా ఉన్న కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి 90 రోజుల గడువు ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆచార్య చేసిన సిఫార్సును కర్ణాటక ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని న్యాయనిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకొనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+