ప్రియుడి తల్లిని నగ్నంగా ఊరేగించిన కేసులో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, ఏం తమాషా చేస్తున్నారా?

కర్ణాటక -మహారాష్ట్ర సరిహద్దు జిల్లా అయిన బెళగావిని కుందానగరి అని పిలుస్తారు. అలాంటి బెళగావి జిల్లాలోని ఒక గ్రామంలో మొత్తం మానవ జాతిని దిగ్భ్రాంతికి గురిచేసే సంఘటన జరిగింది. మహిళపై కొందరు దుండగులు దాడికి పాల్పడి ఆమెను నగ్నంగా చేసి ఊరు మొత్తం ఊరేగించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చర్యకు పాల్పడిన వారికి కర్ణాటక హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది.

బెళగావి జిల్లాలోని ఓ గ్రామంలో మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన ఘటనపై కర్ణాటక హైకోర్టు మండిపడింది. అలాగే ఈ కేసును కర్ణాటక హైకోర్టు సీరియస్‌గా పరిగణించింది. ఈ కేసు సర్వసాధారమైన కేసు కాదని కర్ణాటక హైకోర్టు చెప్పింది. నిందితులను చేతుల్లో అసాధారణ చికిత్స అందుతుందని నిందితులను కర్ణాటక హైకోర్టు హెచ్చరించింది. కర్ణాటక హైకోర్టు సీరియస్ కావడంతో బెళగావి జిల్లాలోని గ్రామంలో మహిళలను అవమానించిన నిందితులకు కఠిన శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.

The Karnataka High Court is angry with the police officers in the case of assaulting a woman and parading her naked

డిసెంబర్ 11వ తేదీన నిశ్చితార్థం జరగనున్న అమ్మాయితో బాధితురాలి కుమారుడు పారిపోయాడు. ప్రేమలో ఉన్నందున ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారని వెలుగు చూసింది. ఈ కారణంగా ప్రియురాలితో పారిపోయిన ప్రియుడి తల్లి దాడి చేసి అమాయకురాలు అయిన ఆ మహిళను నగ్నంగా చేసి ఊరు మొత్తం ఊరేరగించారని ఆరోపణలు ఉన్నాయి. తనను విద్యుత్ స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు ఆరోపణలు చేశారు.

ఈ సంఘటను కర్ణాటక హైకోర్టు సుమోటో కేసుగా స్వీకరించింది. కర్ణాటక హైకోర్టు బెళగావి జిల్లా పోలీసు అధికారులకు నోటీసులు ఇచ్చింది. డిసెంబర్ 18వ తేదీన కోర్టు ముందు హాజరు కావాలని బెళగావి సిటీ పోలీసు కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP)కి కర్ణాటక హైకోర్టు సమన్లు ​​జారీ చేసింది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివిజన్ బెంచ్ ముందు అడ్వకేట్ జనరల్ ఈ సంఘటనపై వివరణ ఇచ్చారు. ఘటనకు సంబంధించి తీసుకున్న చర్యల గురించి పత్రాన్ని సమర్పించారు.

అయితే ఈ నివేదికపై హైకోర్టు డివిజన్ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పూర్తి సమాచారం ఉన్న నివేదికను సమర్పించాలని సూచించింది. ఈ ఘటన తర్వాత జరిగిన దర్యాప్తుపై మాకు సంతృప్తి లేదని హైకోర్టు చెప్పింది. అదనపు నివేదికను దాఖలు చేయడానికి ఏజీ సమయం కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం అదనపు నివేదికను దాఖలు చేయాలని కర్ణాటక హైకోర్టు సూచించింది. మహిళపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కర్ణాటక హైకోర్టు బెళగావి జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+