మద్యం ప్రియులకు గుడ్ న్యూస్, లిక్కర్ బ్యాన్ పై హైకోర్టు తీర్పు, రూ 300 కోట్లు మ్యాటర్ !
బెంగళూరులోని బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహకుల సంఘం వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు సమర్థించింది. బెంగళూరు నగరంలో మద్య నిషేధానికి సంబంధించి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు బుధవారం సవరించింది. విధానపరిషత్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఫిబ్రవరి 14వ తేదీ సాయంత్రం నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు, ఫిబ్రవరి 20వ తేదీన మళ్లీ మొత్తం నాలుగు రోజుల పాటు మద్యం విక్రయాలను నిషేధిస్తూ ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
దీన్ని సవరించిన హైకోర్టు పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు మాత్రమే బెంగళూరు నగరంలో మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 16వ తేదీన బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. దీని వల్ల హోటల్ వ్యాపారానికి నష్టం జరుగుతుంది. వాలెంటైన్స్ డే కారణంగా మేము గరిష్ట అమ్మకాలు, లాభాలను ఆశిస్తున్నామని, అందువల్ల అధికారుల నిర్ణయాన్ని సమీక్షించాలని బెంగళూరు హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధికారులను అభ్యర్థించింది.

అయితే ఈ అభ్యర్థనపై ఎలాంటి స్పందన రాకపోవడంతో సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఎన్నికల్లో 16 వేల మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని, ఈడీ బెంగళూరు జారీ చేసిన మద్యం నిషేధ ఉత్తర్వులు అశాస్త్రీయమని హోటల్ యజమానుల సంఘం పిటిషన్‌లో పేర్కొన్నారు. నాలుగు రోజుల మద్యం నిషేధం వల్ల సుమారు రూ. 300 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
బెంగళూరు హోటల్ అసోసియేషన్ పిటిషన్‌ను విచారించిన కర్ణాటక హైకోర్టు నిషేధాన్ని ఉప ఎన్నికల పోలింగ్ రోజు (ఫిబ్రవరి 16వ తేదీ), కౌంటింగ్ రోజు (ఫిబ్రవరి 20వ తేదీ)కి పరిమితం చేసింది. ఫిబ్రవరి 16వ తేదీన ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అలాగే ఫిబ్రవరి 20వ తేదీన మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. బెంగళూరు టీచర్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఫిబ్రవరి 16వ తేదీన పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ పుట్టన్న రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం జేడీఎస్-బీజేపీ కూటమి అభ్యర్థిగా ఏపీ రంగనాథ్ పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ నుంచి పుట్టన్న పోటీ చేస్తున్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications