Head master: అగ్గిపుల్ల కాల్చి అమ్మాయి చెంప కాల్చిన లేడీ హెడ్ మాస్టర్, అందరూ ఏకం అయితే ?
చెన్నై/ తిరువణ్ణామలై: స్కూల్ లో పిల్లలకు బాగా పాఠాలు చెప్పాలని సాటి టీచర్లకు హెడ్ మాస్టర్ చెప్పాలి. ఒక స్కూల్ కు హెడ్ మాస్టర్ అంటే పిల్లలతో పాటు టీచర్లను కంట్రోల్ లో పెట్టాలి. అయితే ప్రభుత్వ స్కూల్ లో హెడ్ మాస్టర్ అగ్గిపుల్ల కాల్చి విద్యార్థిని చెంపమీద పెట్టడంతో గాయాలైనాయి. అమ్మాయి చెంప మీద అగ్గిపుల్లతో కాల్చింది లేడీ హెడ్ మాస్టర్ కావడం కలకలం రేపింది.
తమిళనాడులోని తిరువణ్ణామలై సమీపంలోని మంగళం పంచాయతీ పరిధిలోని మణిమంగళం గ్రామంలో పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాల ఉంది. కేదంతంగల్ గ్రామానికి చెందిన మునియన్ కు 9 ఏళ్ల కూతురు ఉంది. మునియన్ కూతురు ఆ ఊరిలోని ప్రభుత్వ స్కూల్ లో నాలుగవ తరగతి చదువుతోంది. ఈ పాఠశాలలో ఉషారాణి అనే మహిళ హెడ్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు.

మునియన్ కూతురు సరిగ్గా చదవడం లేదని ఆరోపిస్తూ విద్యార్థిని చెంపపై అగ్గిపెట్టె కాల్చిన హెడ్ మాస్టర్ ఉషారాణి ఆమ్మాయి ముఖం మీద పెట్టింది. దీంతో విద్యార్థిని చెంపకు తీవ్ర గాయమైంది. ఇది చూసి షాక్‌కు గురైన విద్యార్థిని తల్లి మణిమేకలై ఆమె చదువుతున్న పాఠశాలకు వెళ్లి హెడ్ మాస్టర్ ఉషారాణిని నిలదీసింది. అయితే హెడ్ మాస్టర్ ఉషారాణి సరైన సమాధానం చెప్పలేదని అమ్మాయి తల్లి మణిమేకలై ఆరోపించారు.
దీంతో కోపోద్రిక్తులైన మణిమేకలై ఆమె నివాసం ఉంటున్న గ్రామస్తుల సాయంతో తమ కుమార్తె చెంపను కాల్చిన పాఠశాల హెడ్ మాస్టర్ ఉషారాణి మీద చర్యలు తీసుకోవాలని మంగళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హెడ్ మాస్టర్ ఉషారాణిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు.
కేసు నమోదు కావడంతో గురైన హెడ్ మాస్టర్ ఉషారాణి అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే పోలీసులు పోలీసులు చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఉషారాణిని తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జిల్లా ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ అధికారి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్తికేయ పాఠశాలకు వెళ్లి విద్యార్థులను విచారణ చేసి వివరాలు సేకరించారు.
తరువాత పాఠశాల హెడ్ మాస్టర్ ఉషారాణిని విధుల నుంచి తొలగిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. అమ్మాయికి ఆసుపత్రిలో చికిత్స అందించామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. లేడీ హెడ్ మాస్టర్ ఉషారాణి అగ్గిపుల్లతో అమ్మాయి చెంప కాల్చిందని వెలుగు చూడటం తమిళనాడులో కలకలం రేపింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications