ప్రభుత్వ లాంచనాలతో పార్వతమ్మ రాజ్ కుమార్ కు అంతిమవీడ్కోలు: కుప్పకూలిపోయారు !

కన్నడ చలనచిత్ర నిర్మాత, దివంగత డాక్టర్ రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్ కుమార్ అంత్యసంస్కారాలు ప్రభుత్వ లాంచనాలతో పూర్తి చేశారు. పార్వతమ్మ రాజ్ కుమార్ చిన్నకుమారుడు పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ హిం

బెంగళూరు: కన్నడ చలనచిత్ర నిర్మాత, దివంగత డాక్టర్ రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్ కుమార్ అంత్యసంస్కారాలు ప్రభుత్వ లాంచనాలతో పూర్తి చేశారు. పార్వతమ్మ రాజ్ కుమార్ చిన్నకుమారుడు పునిత్ రాజ్ కుమార్ హిందూ సాంప్రధాయం ప్రకారం పూర్తి చేశారు.

డాక్టర్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పార్వతమ్మ రాజ్ కుమార్ కు అంతిమ వీడ్కోలు పలికారు. ప్రభుత్వ లాంచనాలతో దాసయ్య పద్దతి ప్రకారం పునిత్ రాజ్ కుమార్ తన తల్లికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

కన్నడ చిత్ర రంగానికి అమ్మ

కన్నడ చిత్ర రంగానికి అమ్మ

కన్నడ చిత్ర రంగానికి అమ్మగా ఇంతకాలం పెద్ద దిక్కుగా ఉన్న పార్వతమ్మ రాజ్ కుమార్ ఆకస్మిక మరణాన్ని కన్నడ చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఆమె మరణంతో పెద్ద దిక్కును కోల్పోయామని కన్నడ సినీ ప్రముఖులు అంటున్నారు.

బెంగళూరులో !

బెంగళూరులో !

అనారోగ్యంతో బాధపడుతున్న పార్వతమ్మ రాజ్ కుమార్ బుధవారం వేకువ జామున గుండెపోటుతో మరణించారు. బెంగళూరు నగరంలోని సదాశివనగరలోని ఇంటిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పార్వతమ్మ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించారు.

తరలి వచ్చిన సినీ ప్రముఖులు !

తరలి వచ్చిన సినీ ప్రముఖులు !

రెబల్ స్టార్ అంబరీస్, తెలుగింటి ఆడపడుచు సుమలతా అంబరీష్, రియల్ స్టార్ ఉపేంద్ర, జయంతి, కర్ణాటక మంత్రి, నటి ఉమాశ్రీ,, బీజేపీ ఎమ్మెల్సీ, బహుబాష నటి తార, బి. సరోజ దేవి, ప్రేమతో సహ కన్నడ చిత్రపరిశ్రమ ప్రముఖులు తరలి వచ్చి పార్వతమ్మ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించారు.

డాక్టర్ రాజ్ కుమార్ సమాది పక్కనే !

డాక్టర్ రాజ్ కుమార్ సమాది పక్కనే !

సదాశివనగర్ నుంచి అంతిమ యాత్ర మొదలైయ్యింది. మైఖ్రీ సర్కిల్, యశవంతపుర, గురగుంటపాళ్య మీదుగా కంఠీరవ స్టూడియో వరకు అంతిమయాత్ర కొనసాగింది. కంఠీరవ స్టూడియోలోని డాక్టర్ రాజ్ కుమార్ సమాది పక్కనే చిన్నకుమారుడు పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ తన తల్లి పార్వతమ్మ రాజ్ కుమార్ కి అంతిమ సంస్కారాలు చేశారు.

కుప్పకూలిపోయిన కుమారులు !

కుప్పకూలిపోయిన కుమారులు !

పార్వతమ్మ రాజ్ కుమార్ కు అంత్యసంస్కారాలు చేస్తున్న సందర్బంలో ఆమె కమారులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, పునిత్ రాజ్ కుమార్ కుప్పకూలిపోయారు. వారిని ఓదార్చడం ఎవ్వరికీ సాధ్యంకాలేదు. కన్నడ సినీరంగానికి చెందిన అనేక మంది పెద్దలు పార్వతమ్మ రాజ్ కుమార్ కుమారులకు ధైర్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+