ముంబై ఏటీఎస్ అధికారిని లేపేస్తాం: ఐఎస్ఐఎస్
ముంబై: మహారాష్ట్ర ఏటీఎస్ అధికారిని అంతం చేస్తామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు బెదిరించారు. ఏటీఎస్ అధికారితో పాటు ఆయన కుటుంబ సభ్యులను వదిలిపెట్టమని ఉగ్రవాదులు ముంబై పోలీసు కమిషనర్ కు బెదిరింపు లేఖ పంపించారు.
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల పేరుతో వచ్చిన బెదిరింపు లేఖలో మహారాష్ట్ర ఏటీఎస్ అధికారి భానుప్రతాప్ బార్గే, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామని హెచ్చరించారు. ఐఎస్ఐఎస్ పేరుతో వచ్చిన బెదిరింపు లేఖ విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
భానుప్రతాప్ బార్గే పూణె ఏటీఎస్ విభాగంలో పని చేస్తున్నారు. ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చిన బెదిరింపు లేఖ ఎవరు వ్రాశారు అని అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఆ లేఖ ఎక్కడి నుంచి పోస్టు అయ్యింది అని అధికారులు గుర్తించారు.

మహారాష్ట్ర పోలీసులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు సంబంధించి మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు అనేక కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులలో చేరడానికి వెలుతున్న 16 సంవత్సరాల బాలికను ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులలో చేరండి అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు వింటున్న బాలిక ఐఎస్ఐఎస్ లో చేరడానికి సిద్దం అయ్యిందని అధికారులు చెప్పారు. ఇంటిలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో బాలికను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు.
పూణె బాలిక ఇస్లామిక్ స్టేట్ లో చేరకుండా అడ్డుకున్న ఏటీఎస్ టీంలో భానుప్రకాష్ బార్గే ఉన్నారు. అందువలనే భానుప్రకాష్ బార్గేని టార్గెట్ చేసుకుని బెదిరింపు లేఖ పంపించారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications