ప్యాంట్ తీసి పరుగు పెట్టించిన పోలీస్ (వీడియో)
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లో ఒక కానిస్టేబుల్ అందరికి పట్టపగలు చుక్కలు చూపించాడు. రైల్వే స్టేషన్ లో అండర్ వేర్ తో దర్శనం ఇచ్చి మహిళా ప్రయాణికులను పరుగు పెట్టించాడు. అందరికి సినిమా చూపించిన అతనిని చివరికి పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళ్లారు.
ఉత్తరప్రదేశ్ లోని హపూర్ జిల్లాలో ఆదివారం ఒక రైల్వే కానిస్టేబుల్ పీకలదాక మద్యం సేవించాడు. తరువాత ప్యాంటు తీసి విసిరేశాడు. అంతటితో ఆగకుండ అండర్ వేర్ తో రైల్వే స్టేషన్ లోకి వెళ్లి అసభ్యంగా డ్యాన్స్ చెయ్యడం మొదలు పెట్టాడు. అక్కడ ఉన్న మహిళా ప్రయాణికులు తలలు దించుకున్నారు.
విషయం తెలుసుకున్న సాటి పోలీసులు వెళ్లి అతనికి ప్యాంట్ వెయ్యడానికి ప్రయత్నించారు. కుదరకపోవడంగతో అతనికి ఎత్తుకుని వెళ్లి జీపులో వేసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు. గతంలో కూడ ఆ కానిస్టేబుల్ ఇదే విధంగా బట్టలు లేకుండ రైల్వే స్టేషన్ లో తిరిగాడని, పై అధికారులను, రైల్వే శాఖ ఉద్యోగులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాడని పోలీసు అధికారులు (లా అండ్ ఆర్డర్) తెలిపారు.












Click it and Unblock the Notifications