'షాకింగ్' పబ్లిసిటీ స్టంట్: గౌహర్‌ఖాన్‌ను కొట్టలేదు, కొట్టించుకుంది!
ముంబై: బాలీవుడ్ హాట్ గర్ల్ గౌహర్ ఖాన్ పైన ఓ యువకుడు కొద్ది రోజుల క్రితం చేయి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె చెంప చెళ్లుమనిపించిన యువకుడు ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు! అదో పబ్లిక్ స్టంట్ అని, ఆమెను తాను చెంప పైన కొట్టేందుకు తనకు కొంత ఇచ్చిందని, దబాంగ్ 3లో ఓ చిన్న రోల్ ఇస్తానని హామీ ఇచ్చిందని చెబుతున్నాడు.
ఆమెను కొట్టిన వ్యక్తి పేరు అకిల్ మాలిక్. అతను ఓ జూనియర్ ఆర్టిస్ట్. అతను ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. అదో పబ్లిక్ స్టంట్ అని అభిప్రాయపడ్డాడు. అతను చెబుతున్న ప్రకారం... అకిల్ మాలిక్ గత ఏడాది నవంబర్ 28న గౌహర్ ఖాన్‌ను కలిశాడు. ఆమెను కలిసిన రెండు రోజుల తర్వాత చెంప పైన కొట్టిన సంఘటన చోటు చేసుకుంది.
అకిల్ మాలిక్ తనను కలిసినప్పుడు.. తనను స్టేజ్ పైన చెంప పైన కొడితే సల్మాన్ ఖాన్ దబాంగ్ 3లో అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చింది. అయితే, ఆ తర్వాత ఆమె తన స్టేట్‌మెంట్ ఎందుకు మార్చుకుందో తనకు తెలియదని చెప్పాడు. ఈ సంఘటన అంతా ప్రీప్లాన్డ్‌గా జరిగిందన్నాడు.

కాగా, ఓ యువకుడు బాలీవుడ్ నటి చెంప చెళ్లుమనిపించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హాట్ గర్ల్ గౌహర్ ఖాన్ పైన చేయి చేసుకున్నాడు. నా పేరే కాంచనమాల.. నా వయసే గరం మసాలా.. అంటూ శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఆడిపాడిన హాట్ గర్ల్ గౌహర్ ఖాన్.
పొట్టి దుస్తులతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేకెత్తించే ఆమెకు అప్పుడు చేదు అనుభవం ఎదుర్కొంది. ఒక ముస్లింవై ఉండీ ఇలాంటి దుస్తులు వేసుకుంటావా అంటూ నటి, మోడల్ గౌహర్ ఖాన్ చెంప ఛెళ్లుమనిపించాడు ఆ యువకుడు. అక్కడితో ఆగకుండా.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
అతడి పేరు మాలిక్ అకిల్. వయస్సు 24 ఏళ్లు. గోరేగావ్ శివార్లలోని ఫిలిం సిటీలో ఇండియాస్ రా స్టార్ అనే రియాలిటీ షోను నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఆయన మూడు రోజులుగా ఈ షోకు హాజరయ్యాడు. అనంతరం ప్రేక్షకుల్లోని అకిల్ ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే, ఇప్పుడు అదో పబ్లిక్ స్టంట్ అని చెబుతుండటం గమనార్హం.
-
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications