10 ఏళ్లు ఆయనే సీఎం, బీజేపీ లీడర్స్ పై మోదీకి నమ్మకం లేదు, రివర్స్ గేర్
హైకమాండ్ ఓకే అంటే నేనే సీఎం అవుతానని చెప్పిన కర్ణాటక మంత్రి శరణ్బబసప్ప ఇప్పుడు మాటమార్చారు. కాంగ్రెస్ హైకమాండ్ నాయకులు చివాట్లు పెట్టారో ఏమో తెలీదు కాని ఇప్పుడు అదే మంత్రి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు అనుకూలంగా బ్యాటింగ్‌కు దిగారు.ప్రస్తుతానికి కర్ణాటకలో సీఎం కుర్చీ ఖాళీ లేదని, సిద్ధరామయ్య ఐదేళ్లు కాదు పదేళ్లు సీఎంగా ఉంటారని మంత్రి శరణబసప్ప అన్నారు.
సిద్ధరామయ్యకు కర్ణాటక రాష్ట్రంలో ప్రజల మద్దతు చాలా ఎక్కువగా ఉందని, ప్రజల మద్దతు లేకపోవడంతో బీజేపీ ఇప్పుడు సీఎం సిద్ధరామయ్యను టార్గెట్ చేస్తోందని మంత్రి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎవరూ బీజేపీ వైపు వెళ్లడం లేదని, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆపరేషన్ కమల ద్వారా 17 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని మంత్రి శరణబసప్ప గుర్తు చేశారు.

ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడం బీజేపీకి అలవాటు అని ఆయన బీజేపీపై మండిపడ్డారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అంశంపై శరణబసప్ప స్పందించారు. బీజేపీ నేతల విలువ తగ్గిపోయిందని, అందుకే ఇతర పార్టీల నాయకుల విలువ పెరుగుతోందని మంత్రి శరణబసప్ప అన్నారు. డీసీఎం డీకే శివకుమార్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన చెందుతున్నారని కర్ణాటక మంత్రి శరణబసప్ప అన్నారు.
డీకే శివకుమార్ ను కలిసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సమయం కేటాయించారని మంత్రి శరణవసప్ప అన్నారు. కర్ణాటక .రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి బాంబు బెదిరింపుపై మంత్రి శరణబసప్ప స్పందించారు. బీజేపీ కార్యాలయంపై ఎవరు దాడి చేస్తారు చెప్పండి అంటూ వ్యంగంగా అన్నారు. బీజేపీ కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయని. ఐఎన్ఏ నివేదిక ఇచ్చింది, ఎన్ఐఏ కూడా బీజేపీ సొంతం కాబట్టి ఆ విషయంలో ఎక్కువ మాట్లాడటం ఎందుకు అంటూ కర్ణాటక మంత్రి శరణబసప్ప వ్యంగంగా అన్నారు.












Click it and Unblock the Notifications