రాధే మాకు ఊరట, బెయిల్: 70 ప్రశ్నలు
ముంబై: ఆధ్యాత్మిక దేవత రాధే మా (గాడ్ వూమెన్) కు తాత్కలికంగా ఊరట లభించింది. వివాదాస్పద అధ్యాత్మిక దేవత, ఆమె భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు వారాల పాటు రాధే మాను అరెస్టు చెయ్యరాదని ముంబై హై కోర్టు చెప్పింది.
వరకట్నం వేధింపుల కేసులో ముంబైలోని కండ్లివి పోలీస్ స్టేషన్ లో రాధే మా మీద కేసు నమోదు అయ్యింది. బెయిల్ మంజూరు చెయ్యాలని రాధే మా ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యడానికి కోర్టు నిరాకరించింది.
రాధే మా ముంబై హై కోర్టును ఆశ్రయించి బెయిల్ మంజూరు చెయ్యాలని మనవి చేశారు. కేసు వివరాలు తెలుసుకున్న న్యాయస్థానం ముందస్తు జామీను మంజూరు చేసింది. రెండు వారాల పాటు రాధే మాను అరెస్టు చెయ్యరాదని స్టే విధించింది.

శుక్రవారం రాధే మా కండ్లివి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ముంబై పోలీసులు ఆమెను నాలుగు గంటల పాటు విచారణ చేశారు. పోలీసు అధికారులు అడిగిన 70 ప్రశ్నలకు రాధే మా సమాధానం చెప్పారు. ముంబైకి చెందిన నిక్కీ గుప్తా అనే మహిళ ఆమె భర్త నకుల్ తో పాటు కుటుంబ సభ్యుల మీద వరకట్నం వేదింపుల కేసు పెట్టింది.
అదే కేసులో రాధే మా పేరు ఉంది. పలు వివాదాల మద్య సతమతం అవుతున్న మిని స్కర్ట్ రాధే మా మీద ఇప్పటికే ఇంకో మూడు కేసులు నమోదు అయ్యాయి. 7 మంది ఆత్మహత్యలకు కారణం అయ్యారని ఒక కేసు ఉంది, బాలీవుడ్ నటి డాలి బింద్రా తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని రాధే మా బెదిరించారని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications