మోదీ అయినా, మైసూరు మహారాజు అయినా మా నిర్ణయం ఇదే, ఎన్ని లక్షల ఓట్లు అంటే, దెబ్బ !

కర్ణాటకలో అత్యంత ప్రాధాన్యత కలిగిన మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గంలో ఒక్కలిగ సామాజికవర్గం ఓటర్లు ఎవరికి మద్దతిచ్చినా ఆ నాయకుడి విజయం ఖాయమని తెలుస్తోంది. ఇటీవల బీజేపీలో చేరి రాజ‌కీయ నాయకుడి అవతారం ఎత్తిన మైసూరు మహారాజ వంశీయుడు యదువీర్ వడయార్‌ను లోక్ సభ ఎన్నికల రంగంలోకి దింపిన బీజేపీ హైకమాండ్ కు ఊహించని షాక్ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎం. లక్ష్మణ్‌ను రంగంలోకి దించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన సొంత జిల్లా మైసూరులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ కారణంగా సీఎంతో పాటు కొందరు మంత్రులు మైసూరు జిల్లాలోనే మకాం వేసి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసేలా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మైసూరులో అనేక వ్యూహాలు రచిస్తున్నారు.

The Mysuru Okkaliga Sangam leaders gave a shock to BJP MP candidate Yaduveer Odayar

సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ రాజకీయాలు ఇప్పుడు బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి యదువీర్ వడయార్‌కు ఒక్కలిగ సంఘం పెద్ద షాక్‌ ఇచ్చింది. మైసూరు- కొడగు ప్రస్తుత ఎంపీ, ఒక్కలిగ సంఘం నేత ప్రతాప్ సింహాకు బీజేపీ ఈసారి టికెట్ ఇవ్వలేదు. మైసూరు సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాకు బీజేపీ హైకమాండ్ టికెట్ నిరాకరించడంపై ఇప్పటికే మైసూరులో ఒక్కలిగ సామాజికవర్గం ఆగ్రహంతో రగిలిపోతున్నది.

దానిని తోడుగా మైసూరులో ఒక్కలిగ కులాన్ని కాంగ్రెస్ పార్టీ తన రాజకీయాలకు వాడుకుంటున్నది. దీంతో ఒక్కలిగ కమ్యూనిటీ బీజేపీపై తిరగబడి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పలికారు. మైసూర్-కొడగు లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ప్రతాప్ సింహా స్థానంలో మైసూరు మహారాజ యదువీర్ వడయార్‌ను బీజేపీ రంగంలోకి దించింది. ఒక్కగానొక్క ఒక్కలిగ అభ్యర్థిని విస్మరించినందుకు బీజేపీపై అదే సామజిక వర్గం అస్త్రాన్ని ప్రయోగించిన కాంగ్రెస్ ఇప్పుడు రాజకీయాలు చేస్తోంది.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు, ఒక్కలిగ వర్గానికి చెందిన ఎం.లక్ష్మణ్‌ను రంగంలోకి దించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మైండ్ గేమ్‌ ఆడుతోంది. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చిన ఒక్కలిగ కులం నాయకులు ఆ ప్రాంతంలో బీజేపీకి సినిమా చూపించాలని ప్లాన్ చేశారు. మైసూరు జిల్లా ఒక్కలిగ సంఘం అధ్యక్షుడు మారిస్వామి ఇప్పుడు బహిరంగంగా మైసూరు-కొడగు లోక్ సభ నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఎం.లక్ష్మణ్‌కు మద్దతు ప్రకటించారు.

The Mysuru Okkaliga Sangam leaders gave a shock to BJP MP candidate Yaduveer Odayar

ప్రస్తుత మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, రెండు సార్లు ఎంపీ కావడంతో ఆయనకు ఎందుకు టికెట్ నిరాకరించారు అని బీజేపీని ప్రశ్నించారు. ఒక్కలిగులను పక్కాప్లాన్ తో పక్కనపెట్టారని, అందుకే మేము కాంగ్రెస్ కు మద్దతు పలకాలని నిర్ణయం తీసుకున్నామని, మా కులం వ్యక్తిని కచ్చితంగా గెలిపించుకుంటామని ఆ జిల్లా ఒక్కలిగ సంఘం నాయకులు అంటున్నారు.

అంతేకాకుండా మా కులానికి చెందిన ఎం లక్ష్మణ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కాబట్టి మేం ఆయనకు మద్దతు ఇవ్వడం జరిగిందని ఆ జిల్లా ఒక్కలిగ కులస్తులు తేల్చి చెప్పారు. ఒక్కలిగ కులస్తుల నిర్ణయంతో ఇప్పుడు మైసూరు మహారాజు యదువీర్ తో సహ బీజేపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. మైసూరు-కొడగు లోక్‌సభ అభ్యర్థి లక్ష్మణ్‌కు ఇటీవల ప్రచారం చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారికే తాము ఎంపీ సీటు ఇచ్చామని ఉద్ఘాటించారు మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గంలో 4 లక్షల మందికి పైగా ఒక్కలిగాలు, 1.5 లక్షల మంది బ్రాహ్మణ ఓటర్లు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+