బెంగళూరు చర్చి గేట్ పేలుడు: సిమి ఉగ్రవాది అరెస్టు
బెంగళూరు: 2014 డిసెంబర్ 28వ తేది రాత్రి 8. 35 గంటల సమయంలో బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డు సమీపంలోని చర్చి స్ట్రీట్ లో జరిగిన బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఓ నిందితుడిని అరెస్టు చేశారు. మహమ్మద్ రఫీక్ అలియాస్ అలమ్ జబ్ అఫ్రీది అనే నిందితుడిని అరెస్టు చేశారు.
శుక్రవారం ఎన్ఐఏ అధికారులు అలమ్ జబ్ అఫ్రీదిని అరెస్టు చేసిన విషయం ధ్రువీకరించారు. ఇతను స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్స్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాద సంస్థకు చెందిన వాడని అధికారులు అంటున్నారు.

చర్చి స్ట్రీట్ బాంబు పేలుడు నిందితుడిని పట్టిస్తే రూ. మూడు లక్షలు బహుమానం ఇస్తామని గతంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ప్రకటించారు. ఇతను బెంగళూరు నగర శివార్లలో గత మూడు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాడని, ఏసీ మెకానిక్ గా పని చేస్తున్నాడని అధికారులు తెలిపారు. ఈ బాంబు పేలుడులో చెన్నైకి చెందిన మహిళ మరణించింది.












Click it and Unblock the Notifications