తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు.. శ్రీలంక బాంబు పేలుళ్ల సంబంధాలపై విచారణ
తమిళనాడులో ఐసీస్‌కు సపోర్ట్ చేస్తున్నారన్న సమాచారంతో తమిళనాడు రాష్ట్ర్ర్రంలోని పదిచోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా ఈసోదాలు ఏకకాలంలో పదిమంది ఐఎస్ సానూభూతి పరుల ఇళ్లలో జరిగాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర జరుగుతుందన్న సమాచారంతోనే ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.

కాగా తమిళనాడులోని ముత్తుపేట్, కిలాకరాయి, దేవీపట్టినం, లాల్‌పేట్,తోపాటు చిదంబరం ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో ల్యాప్‌ట్యాప్‌లు, హర్డ్‌డిస్క్‌లతోపాటు పెన్‌డ్రైవ్ ఇతర సాంకేతిక పరికారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడ వీరిపై 2018లోనే ఆయుధాలు, ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్నారన్న కేసు నమోదు చేసీ కోర్టులో హజరుపరిచారు. అయితే మొత్తం పదిమంది గ్రూపులో తోమ్మిది మందిని అరెస్ట్ చేశామని మిగతా ఒక్కరు తప్పించుకున్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
తోమ్మిది మందికి బెయిల్ లభించడంతో వారు విడుదల అయ్యారని పోలీసులు తెలిపారు. కాగా బెయిల్ నుండి విడుదలైన వారు తిరిగి ఐఎస్ సానుభూతిపరులుగా ఉన్న అనుమానంతోనే దాడులు చేసినట్టు వారు తెలిపారు.ఇక వారు ఓ వాట్పస్ గ్రూప్‌ను కూడ కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.మరోవైపు శ్రీలంకలో జరిగిన ఈస్టర్ ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లలకు సంబంధించి ఏమైన లింకు ఉందా కోణంలో
పోలీసులు సోదాలు జరిపినట్టు తెలుస్తోంది,












Click it and Unblock the Notifications