జనవరి 23నుంచి నేతాజీ సీక్రెట్ ఫైళ్లు బహిర్గతం: మోడీ
ఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధంచిన రహస్య ఫైళ్లను అన్నింటినీ జనవరి 23వ తేదీ నుంచి బహిర్గతం చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ప్రధాని మోడీని నేతాజీ కుటుంబ సభ్యులు 35 మంది కలిశారు. గంటపాటు మాట్లాడారు.
నేతాజీకి సంబంధించిన అన్ని రహస్య పత్రాలను తమ ప్రభుత్వం బహిర్గతం చేస్తుందని ప్రధాని మోడీ వారికి చటెప్పారు. 1945 ఆగస్టు 18న నేతాజీ అదృశ్యమైనప్పటినుంచి ఆయన అదృశ్యానికి సంబంధించిన మిస్టరీలో వాస్తవాలను బయటపెట్టాలంటూ నేతాజీ కుటుంబ సభ్యులతో పాటుగా పలు వర్గాలు గత 70 ఏళ్లుగా చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చినట్లవుతుంది.
బుధవారం 7, రేస్‌కోర్సు రోడ్డులోని తన అధికార నివాసంలో తనను కలిసిన నేతాజీ కుటుంబ సభ్యులకు ప్రధాని ఈ హామీ ఇచ్చారు. చరిత్రను గొంతు నులమాల్సిన అవసరం లేదని అనంతరం ఈ అంశంపై ట్విట్టర్‌లో ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

అంతేకాదు నేతాజీకి సంబంధించి తమ వద్ద అందుబాటులో రహస్య పత్రాలను వెల్లడించాల్సిందిగా ఇతర దేశాల నేతలను లేఖల ద్వారా, వ్యక్తిగతంగా కలిసినప్పుడు కోరుతానని, డిసెంబర్‌లో రష్యాతో ఇది ప్రారంభమవుతుందని తెలిపారు.
తమ చరిత్రను మరిచిపోయే దేశాలకు దాన్ని సృష్టించే శక్తి ఉండదని ప్రధాని అన్నారు. సుభాష్ జయంతి అయిన 2016 జనవరి 23న నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాల వెల్లడించే ప్రక్రియ ప్రారంభమవుతుందని దాదాపు గంట సేపు నేతాజీ కుటుంబ సభ్యులతో సమావేశం అనంతరం ట్విట్టర్‌లో మోడీ తెలిపారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications