3 సంవత్సరాల బాలికపై లైంగిక దాడి
బెంగళూరు: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను పిలుచుకుని వెళ్లి అత్యాచారం చేసి పరారైన సంఘటన బెంగళూరు నగరంలోని కాడుగోడి పోలీస్ స్టేషన్ పరధిలో జరిగింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన సందీప్ (27) అనే కామాంధుడు తప్పించుకున్నాడని పోలీసులు అన్నారు.
సందీప్ నెల క్రితం బెంగళూరు చేరుకుని పెయింట్ పని చేస్తున్నాడు. ఇతను దిణ్ణూరులో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో 3 సంవత్సరాల బాలిక నివాసం ఉంటున్నది. ఆదివారం బాలిక ఇంటి ముందు ఆడుకుంటున్నది.

ఆ సమయంలో అటువైపు వెళ్లిన కామాంధుడు సందీప్ బాలికకు చాక్లెట్ లు ఇచ్చాడు. తరువాత బాలికను నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లి లైంగికదాడి చేశాడు. బాలిక కేకలు వెయ్యకుండ ముఖానికి బట్టలు చుట్టి జాగ్రతలు తీసుకున్నాడు. ఆదివారం రాత్రి పొద్దుపోయినా బాలిక ఇంటికి వెళ్లలేదు.
బాలిక కుటుంబ సభ్యులు వివిధ ప్రాంతాలలో గాలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం బాలిక ఇంటి సమీపంలోని నిర్జనప్రదేశంలో దుస్తులు లేకుండా అర్థనగ్నంగా పడి ఉన్న విషయం గుర్తించారు. బాలికను ఆసుపత్రికి తరలించారు. సందీప్ బాలిక మీద లైంగికదాడి చేసి పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని డీసీపీ రోహిణి సపెట్ తెలిపారు.












Click it and Unblock the Notifications