డేంజర్ బెల్స్ - రాహుల్ వాట్ నెక్స్ట్..!!
మహారాష్ట్రలో కాంగ్రెస్ కు ఊహించని దెబ్బ తగిలింది. కూటమి కట్టి గెలుపు సాధిస్తామని ధీమాగా ఉన్న కాంగ్రెస్ కు ఫలితాలు అంతు చిక్కటం లేదు. ఫలితాల పైన పోస్టు మార్టం ప్రారంభించింది. పార్టీలను చీల్చిన బీజేపీ పైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కాంగ్రెస్ భావించింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని ధీమాగా ఉంది. కానీ, బీజేపీ కూటమి రాజకీయం ముందు కాంగ్రెస్ చేతులెత్తేసింది. ఈ ఫలితాలతో కాంగ్రెస్ కు డేంజర్ బెల్స్ మోగినట్లే. జమిలి చర్చ వేళ రాహుల్ ఈ పరిస్థితిని ఎలా సరి దిద్దుతారు. పూర్వ వైభవం సాధ్యమేనా.
ఘోర పరాభవం
గెలుస్తామనుకున్న హర్యానా చే జారింది. బీజేపీ ఖాతాలో చేరింది. ఇప్పుడు మహారాష్ట్రలో గెలుపు ఖాయమనుకుంటే ఘోర పరాభవం ఎదురైంది. జార్ఖండ్ లో సోరెన్ సహకారంతో కూటమిగా కాంగ్రెస్ కు పరువు దక్కింది. వాయనాడ్ లో ప్రియాంక విజయం మాత్రమే కాంగ్రెస్ కు ఊరటనిచ్చే అంశంగా మిగిలింది. హర్యానా గుణపాఠం గా మహారాష్ట్రలో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టినా బీజేపీ రాజకీయం మందు పోటీకి నిలవలేదు. మహారాష్ట్రలో స్థానిక అంశాలతో పాటుగా మహిళా, యువతను ఆకట్టుకునే మేనిఫెస్టోలతో బీజేపీ కూటమి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లింది. మహా యుతి కూటమిలో కనిపించిన నేతల మధ్య ఐక్యత కాంగ్రెస్ కూటమిలో కనిపించలేదు.

నేర్చుకోని గుణపాఠం
కూటమిలో జరిగిన ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ 101 స్థానాల్లో పోటీ చేసింది. 16 స్థానాలకే పరిమితం అయింది. మిత్రపక్షాల నాయకత్వం పైనే కాంగ్రెస్ ఎక్కువగా ఆధారపడింది. గతం లో ఎన్నడూ లేని విధంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పూర్తిగా బలహీన పడింది. కనీస పోటీ ఇవ్వలేక పోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ముంచుకొస్తోంది. కొద్ది నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు సాధించింది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు పెంచుకునే అవకాశాలు ఉన్న హర్యానా, మహారాష్ట్రలో మాత్రం విఫలమైంది. దీనికి పూర్తిగా నాయకత్వ వైఫల్యమే కారణంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో సునామీ తరహా ఫలితాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ కూటమి ఆపరేషన్ ఆకర్ష్ తో మరింతగా కాంగ్రెస్ నష్టపోయే ప్రమాదం పొంది ఉంది.
రాహుల్ నెక్స్ట్ స్టెప్
మహారాష్ట్రలో కాంగ్రెస్ మూడు దశాబ్దాల కాలంగా ఎప్పుడూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. 1990లో శరద్ పవార్ నేతృత్వంలో 49 శాతం ఓట్లతో 141 స్థానాలు సాధించిన కాంగ్రెస్ ఆ తర్వాత ఏ ఎన్నికలోను మూడంకెల సీట్లకు చేరుకోలేదు. శరద్ పవార్ సొంత కుంపటి పెట్టుకోవడం వల్ల 1995లో హస్తం పార్టీ 80 సీట్లకే పరిమితమై రెండోసారి అధికారానికి దూర మైంది. ఆ తరువాత వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో కాంగ్రెస్ మరింత బలహీన పడుతూ వస్తోంది. ఇప్పుడు జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. రాహుల్ గాంధీ స్వయంగా మహారాష్ట్ర పైన ఫోకస్ చేసినా ఫలితం దక్కలేదు. పార్టీలో సమన్వయం కనిపించ లేదు. దీంతో, ఇప్పుడు రాహుల్ త్వరలో జరగనున్న ఢిల్లీ, బీహార్ ఎన్నికల కోసం పార్టీలో ఎలాంటి మార్పులు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications