బుర్కా వేసుకోలేదని ఆర్ టీసీ బస్సులో నుంచి అమ్మాయిని కిందకు దించేసిన డ్రైవర్ !
బెంగళూరు/కలబురిగి: ఆర్ టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన కర్ణాటక ప్రభుత్వానికి ఇప్పుడు అనేక రకాలుగా తలనొప్పులు తయారైనాయి. బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికుల మీద కేఎస్ఆర్ టీసీ సిబ్బంది, బీఎంటీసీ సిబ్బంది నిర్లక్షంగా వ్యవహరించారని ఇప్పటికే వెలుగు చూసింది. ఇప్పుడు మరో వివాదంలో కేఎస్ఆర్ టీసీ సిబ్బంది చిక్కుకున్నారు.
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని కమలాపూర్‌లో బురఖా ధరించలేదని కేకేఆర్‌టీసీ బస్సు డ్రైవర్ ఒకరు విద్యార్థినిని బలవంతంగా బస్సు నుంచి దింపేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బస్ డ్రైవర్ పై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీసు అధికారులకు, కేఎస్ఆర్ టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

నువ్వు ముస్లిం కమ్యూనిటీకి చెందిన విద్యార్థిని కాబట్టి బస్సు ఎక్కాలంటే హిజాబ్ ధరించాలని ఆదేశిస్తూ బస్సు డ్రైవర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంతో తన దగ్గర హిజాబ్ లేదని, రేపటి నుంచి హిజాబ్ వేసుకుని బస్సు విద్యార్థిని ప్రయాణానికి అనుమతించాలని విద్యార్థినితో పాటు వచ్చిన ఉపాధ్యాయులు బస్సు డ్రైవర్‌కు విజ్ఞప్తి చేశారు.
విద్యార్థినిని బస్సులో ప్రయాణించేందుకు అనుమతించాలని విద్యార్థిని వెంట ఉన్న ఉపాధ్యాయులు బస్సు డ్రైవర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే తనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని బెదిరించిన ఉపాధ్యాయులతో డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఉపాధ్యాయులు కేఎస్ఆర్ టీసీ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications