Supreme Court: గృహిణిల సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి,కానీ..సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

గృహిణిల సేవ‌ల వెల‌క‌ట్ట‌లేనివి.. వారి సేవ‌ల‌ను ఆర్థిక కోణంలో చూడ‌కూడ‌దంటూ ఓ కేసు విష‌యంలో సుప్రీం కోర్టు మాన‌వీయ కోణంలో వ్యాఖ్య‌లు చేసింది. భార‌తీయ సంప్రదాయాల్లో మ‌హిళ‌ల‌కు ఇస్తోన్న గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్థానాన్ని గుర్తు చేసింది. ఓ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ప‌రిహారం విష‌య‌లో తీర్పును వెలువ‌రిస్తూ సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది.

ఉత్త‌రాఖండ్‌లో జ‌రిగిన ఓ యాక్సిడెంట్ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2006లో జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి బీమా సౌకర్యం లేకపోవడంతో ఆ వాహన యజమాని ఆమెకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఈ కేసును విచారించిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ మృతురాలి కుటుంబానికి (భర్త, ఆమె మైనర్ కుమారుడు) రూ. 2.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. అయితే అది త‌క్కువ మొత్త‌మ‌ని, ఆ మొత్తాన్ని పెంచాలని కోరుతూ బాధిత కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది.

The services of housewives are priceless, Supreme court key comments

ఆ పిటిషన్‌ను ప‌రిశీలించిన ఉత్త‌రాఖండ్‌ హైకోర్టు 2017లో దాన‌ని కొట్టివేసింది. అందుకు గ‌ల కార‌ణాల‌ను తెలుపుతూ.. మ‌ర‌ణించిన మహిళ గృహిణి క‌నుక ఆమె ఆదాయం పరిమితంగా ఉంటుంద‌ని, అంచేత‌ ఆమెకు ఇవ్వాల్సిన పరిహారం కూడా ప‌రిమితంగానే చూడాల‌ని, కనీస ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లించడం స‌రైన నిర్ణ‌య‌మేన‌ని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశాల‌ను స‌మ‌ర్థిస్తూ పిటిష‌న్‌ను కొట్టివేసింది.

హైకోర్టు తీర్పును త‌ప్పుబ‌ట్టింది: దీంతో బాధిత కుటుంబం హైకోర్టు తీర్పును స‌వాలు చేస్తూ.. సుప్రీంకోర్టు త‌లుపులు తట్టారు. ఈ కేసును విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బాధిత కుటుంబానికి అనుకూలంగా తీర్పు వెలువ‌రించింది. ఈ సంద‌ర్భంగా ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును తప్పుబట్టింది.

గృహిణి సేవలను తక్కువగా అంచనా వేయడం సరికాదని, ఇంట్లో నిర్విరామంగా ప‌ని చేస్తూ త‌న జీవితాన్ని ఇంటికోసం కేటాయించే ఆమె సేవలను ఆర్థిక కోణంలో చూడ‌కూడ‌ద‌ని, ఇంట్లో సంపాదించే వ్యక్తితో పోల్చితే ఆమె ఏమీ తక్కువ కాదని వ్యాఖ్యానించింది. గృహిణి ఆదాయాన్ని దినసరి కూలీ కంటే తక్కువగా ఎలా పరిగణిస్తారని సూటిగా ప్రశ్నించింది. ఆమె సేవలను వెలకట్టలేమనడంలో సందేహం లేదని తెలిపింది. బాధిత కుటుంబానికి రూ. 6 లక్షల పరిహారాన్ని ఆరు వారాల్లోపు ఇవ్వాలని ఆదేశిస్తూ సంచ‌ల‌న‌ తీర్పు వెలువరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+