ప్రజ్వల్ రేవణ్ణకు షాక్, అడుగుపెట్టిన వెంటనే అలా చేస్తాము, హోం మంత్రి క్లారిటీతో !
హాసన్ లోక్‌సభ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ, హాసన్ లోక్‌సభ నియోజకవర్గం కూటమి అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా, జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ప్రజ్వల్ రేవణ్ణ దేశం నుంచి పారిపోయి దాదాపు నెల రోజులు అవుతోంది. ప్రజ్వల్ రేవణ్ణ కోసం సిట్ అధికారులు నిరంతరం గాలిసూనే ఉన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ దేశంలో అడుగుపెట్టిన మరుక్షణం ఆయన్ను అరెస్టు చెయ్యడానికి రంగం సిద్దం అయ్యింది.
మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ జైలుకెళ్లారు. ఇప్పుడు ప్రజ్వల్ రేవణ్ణ కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుటుంబం తీవ్ర ఇబ్బందికి గురి అయ్యింది. మాజీ సిఎం హెచ్‌డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ వార్నింగ్ మేరకే సిట్ ముందు హాజరవుతానని ప్రజ్వల్ రేవణ్ణ గత సోమవారం విదేశాల నుంచి ఓ వీడియో విడుదల చేశారు. అలాగే ప్రజ్వల్ దేశానికి వచ్చిన వెంటనే సిట్ అధికారులు అరెస్ట్ చెయ్యడానికి అన్ని సిద్దం చేసుకుంటున్నారు.

దేశం విడిచి విదేశాలకు వెళ్లి విదేశాల్లో కూర్చున్న ప్రజ్వల్ రేవణ్ణ వీడియోను విడుదల చేశారు. నన్ను ఈ కేసులో ఇరికించేందుకు భారీ కుట్రలు జరిగాయి. అయితే నేను ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను. ఈ నెల 31వ తేదీన భారతదేశానికి తిరిగి వస్తానని, మే 31వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరు అవుతానని ప్రజ్వల రేవణ్ణ ఆ వీడియోలో చెప్పారు. అన్ని విచారణలను ఎదుర్కొంటానని ప్రజ్వల్ రేవణ్ణ అన్నారు.
నేను కర్ణాటక రాష్ట్ర ప్రజలకు, జేడీఎస్ కార్యకర్తలు, మా తల్లి, తండ్రికి తాతకు, మా చిన్నాన కుమారన్నతో పాటు కుటుంబ సభ్యులు అందరికి తాను బహిరంగ క్షమాపణలు చెబుతున్నానని ప్రజ్వల్ రేవణ్ణ అన్నారు. నేను విదేశాల్లో ఉన్నానని మీకు తెలియజేయనందుకు నేను ఖచ్చితంగా క్షమాపణలు కోరుతున్నాను. దేవుడి ఆశీస్సులు, కుటుంబసభ్యుల ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు నాపై ఉండాలని ప్రజ్వల్ రేవణ్ణ కోరుకున్నారు.
ప్రజ్వల్ రేవణ్ణ దేశానికి రాగానే అరెస్టు చేస్తామని, సిట్ వద్ద ఉన్న సమాచారం, డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ జరుగుతుందని, ఇప్పటికే ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారి అయినందున సిట్ అధికారులు వారిపని వారు చేస్తారని కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ అన్నారు. హాసన్ ఎంపీ ప్రజ్వల్ సిట్‌కి ఇవ్వాల్సిన స్టేట్‌మెంట్ ఇవ్వనివ్వండి. దర్యాప్తు బృందం తదుపరి చర్యలు తీసుకుంటుందని, ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ కర్ణాటక రాష్ట్రంలో జరగలేదని హొం మంత్రి పరమేశ్వర్ అన్నారు.

ముందుగా ప్రజ్వల్ రేవణ్ణ కర్ణాటక రాష్ట్రానికి వచ్చి విచారణను ఎదుర్కోవాలని డాక్టర్ పరమేశ్వర అన్నారు. ప్రజ్వల్‌ని కనుగొనడానికి మేము ఇంకా మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, వారెంట్ జారీ అయ్యిందని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమాచారం అందించామని, బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయబడిందని, లొకేషన్ తెలుసుకున్న ఇంటర్‌పోల్ ఆరా తీస్తోందని హొం మంత్రి పరమేశ్వర్ అన్నారు.
ఇంత జరిగిన తరువాత ప్రజ్వల్ నేను తిరిగి వస్తానని చెప్పాడు హోం మంత్రి పరమేశ్వర్ అన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ తీసుకున్న నిర్ణయం చాలా సముచితం. ఎందుకంటే చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అతని పాస్‌పోర్ట్ గడువు మే 31వ తేదీతో ముగుస్తుంది. ఇవన్నీ ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు అని కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్ అన్నారు. మొత్తం మీద భారతదేశంలో అడుగుపెట్టిన వెంటనే ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చెయ్యడానికి సిట్ సిద్దం అయ్యిందని తెలిసింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications