father: ఆంటీ మీద అంకుల్ కు ఫుల్ డౌట్, అసలే రెండో భార్య, తండ్రిని వెంటాడి చంపేసి !
భార్యను వదిలేసిన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు 22 ఏళ్ల కొడుకు ఉన్నాడు. రెండో భార్యతో కలిసి అతను జీవిస్తున్నాడు. రెండో భార్యకు 45 ఏళ్లు మాత్రమే ఉండటం, ఆమె చూడటానికి చాలా అందంగా ఉండటంతో ఆమె మీద భర్తక
చెన్నై/ సేలం: వివాహం చేసుకున్న వ్యక్తికి పిల్లలు ఉన్నారు. భార్యతో తేడాలు రావడంతో భర్త అతని భార్యను వదిలేశాడు. భార్యను వదిలేసిన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు ఓ కొడుకు ఉన్నాడు. కొడుక్కి 22 ఏళ్లు. రెండో భార్యతో కలిసి అతను జీవిస్తున్నాడు. రెండో భార్యకు 45 ఏళ్లు మాత్రమే ఉండటం, ఆమె చూడటానికి చాలా అందంగా ఉండటంతో ఆమె మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. అయితే కొడుకు చేతిలో తాను హత్యకు గురౌతానని అతను ఊహించలేకపోయాడు.

మొదటి భార్యను వదిలేశాడు
తమిళనాడులోని సేలం జిల్లాలోని అత్తూరులోని శక్తినగర్‌లోని పుతుమారియమ్మన్ గుడి వీధికి చెందిన కృష్ణరాజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వివాహం చేసుకున్న కృష్ణరాజ్ పిల్లలు ఉన్నారు. భార్యతో తేడాలు రావడంతో కృష్ణరాజ్ చాలా సంవత్సరాల క్రితమే అతని భార్యను వదిలేశాడు. భార్యను వదిలేసిన కృష్ణరాజ్ మీనా అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు.

రెండో భార్యతో కాపురం
కృష్ణరాజ్, మీనా (45) దంపతులకు విఘ్నేష్ (22) అనే కొడుకు ఉన్నాడు. మీనా మీద ఆమె భర్త కృష్ణరాజ్ కు అనుమానం మొదలైయ్యింది. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న కృష్ణరాజ్ అతని భార్య మీనాతో గొడవపడుతున్నాడు. చాలా కాలం నుంచి కృష్ణరాజ్ కొడుకు విఘ్నేష్ అతని తండ్రి తీరుతో చాలా కోపంగా ఉన్నాడు.

రెండో భార్యను చితకబాదేశాడు
కృష్ణరాజ్‌కి, అతని రెండో భార్య మీనాకు తరచూ కుటుంబ కలహాలు జరిగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న రాత్రి భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆ సందర్బంలో కృష్ణరాజ్ అతని రెండో భార్య మీనాపై దాడి చేశాడు. ఇది చూసిన మీనా కుమారుడు విఘ్నేష్ తండ్రిని తిట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి గొడవకు దారి తీసింది.

కొడుకు దెబ్బకు పరుగు తీసిన తండ్రి
దీంతో కోపోద్రిక్తుడైన విఘ్నేష్ ఇంట్లో ఉన్న కత్తిని బయటకు తీసుకు వచ్చి అతని తండ్రి కృష్ణరాజ్ మెడపై నరికేశాడు. ఆ సందర్బంలో కృష్ణరాజ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. పొరుగున ఉన్న కతిరేశన్ ఇంట్లో ఆశ్రయం పొందేందుకు కృష్ణరాజ్ ప్రయత్నించాడు, అయితే అది సాధ్యం కాకపోవడంతో కృష్ణరాజ్‌పారిపోవడానికి ప్రయత్నించాడు.

తండ్రిని వెంటాడి చంపేసిన కొడుకు
ఆ సమయంలో తండ్రిని వెంటాడి వెంటాడి నరికేసిన రెండో భార్య మీనా కొడుకు విఘ్నేష్ అక్కడి నుంచి పారిపోయాడు. కృష్ణరాజ్ రక్తపుమడుగులో కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడు కృష్ణరాజీన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండో భార్య మీనా కుమారుడు విఘ్నేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications