లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్యను, అత్తమామలను కారులోనే ఎలా చంపేశాడంటే ?
యువతి వెంటపడి నిన్ను ప్రేమిస్తున్నానని ఆమెను ప్రాధేయపడి చివరికి ఆమె కాళ్లపై పడి పెళ్లి చేసుకున్న అల్లుడు ఇప్పుడు కిరాతకుడు అయ్యాడు. ప్రేమించి ప్రాధేయపడి చివరికి మా కూతురిని పెళ్లి చేసుకున్న అల్లుడు ఆమెను జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అనుకున్న ఆమె తల్లిదండ్రులు దారుణ హత్యకు గురైనారు.
లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులు కిరాతకంగా హత్య చేశాడు. కర్ణాటకలోని యాదగిరి తాలూకాలోని సైదాపూర్ సమీపంలో భార్య, అత్తమామలను దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన వారిని దావణగెరెకి చెందిన భార్య అన్నపూర్ణ (25), అత్త కవిత (45), మామ బసవరాజప్ప (52) అని పోలీసులు అన్నారు. హత్య చేసిన నిందితుడిని యాదగిరి తాలూకా మునగల్ గ్రామానికి చెందిన నవీన్ (30)గా గుర్తించారు.

నాలుగేళ్ల క్రితం దావణగెరెకు చెందిన అన్నపూర్ణను నవీన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లు ఇద్దరూ కలిసి బాగానే జీవించారు.
సంతోషకరమైన కుటుంబంలో నవీన్, అన్నపూర్ణ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. అయితే పాప పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలకే గొడవపడే భర్త నవీన్ వేధింపులతో విసిగి వేసారిన అన్నపూర్ణ స్వగ్రామమైన దావణగెరె జిల్లాలోని డౌంగెరెకు వచ్చింది.
ఏడాది కాలంగా స్వగ్రామంలో ఉంటున్నా భర్త నవీన్ దగ్గరకు వెళ్లేందుకు అన్నపూర్ణ ఇష్టపడలేదు. అయితే గత ఏడాది కాలంగా తల్లిదండ్రులతో హాయిగా ఉంటున్న నా భార్య అన్నపూర్ణ నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేయడం ఆమెకు ఆనందంగా ఉందని నవీన్ రగిలిపోయాడు. భార్య సంతోషాన్ని చూసి తట్టుకోలేక మనసులోనే భార్యతో పాటు ఆమెకు మాయమాటలు చెప్పి తనకు దూరం చేసిన అత్తమామలను చంపేయాలని నవీన్ ప్లాన్ వేసుకున్నాడు.
ఈ విషయమై మాట్లాడటానికి బుధవారం భార్య అన్నపూర్ణ ఇంటికి వచ్చిన అల్లుడు నవీన్ అత్తమామలతో మాట్లాడాడు.. నా భార్య అన్నపూర్ణను నాతో పంపించాలని, ఆమెతో సంతోషంగా జీవనం చేస్తానని చెప్పాడు. అప్పుడు మామగారి ఇంట్లో కొందరు పెద్దలు కలసి రాజీ పంచాయితీ చేశారు. కూతురు అన్నపూర్ణని కొన్ని షరతులతో భర్త నవీన్ ఇంటికి పంపడానికి అతని అత్తమామలు అంగీకరించారు. తరువాత కూతురు అన్నపూర్ణ ఆమె తల్లిదండ్రులిద్దరూ యాదగిరిలోని భర్త నవీన్ ఇంట్లో దింపేందుకు వచ్చారు.
యాదగిరిలో కూడా అల్లుడు నవీన్ మరోసారి కుటుంబ పెద్దలతో రాజీ పంచాయితీ చేసి కూతురిని వదిలారు. గురువారం వాళ్ల ఊరికి వెళ్లడానికి అత్తమామలు కవిత, బసవరాజప్ప బయలుదేరారు. ఆ సమయంలో అల్లుడు నవీన్ మిమ్మల్ని కారులో బస్ స్టేషన్ దగ్గర వదిలిపెడతానని చెప్పాడు. అనంతరం అత్తగారు కవిత, మామ బసవరాజప్ప, భార్య అన్నపూర్ణ ముగ్గురితో కలిసి వారిని కారులో తీసుకెళ్లారు.
అనంతరం రోడ్డు పక్కన కారు ఆపిన నవీన్ ముగ్గురిపై ఇనుప రాడ్‌తో దాడి చేసి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
తరువాత, అతను తన భార్య అన్నపూర్ణ, అత్త కవిత, మామ బసవరాజప్ప మృతదేహాలను కారులో తీసుకెళ్లి వడగెర తాలూకా జోలదడగి గ్రామ సమీపంలో పడేశాడు. యాదగిరిలో అన్నపూర్ణతో పాటు ఆమె తల్లిదండ్రుల మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆమె భర్త నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సైదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications