కూతురి ఇంటికి వెళ్లి తల్లి ఏం చేసిందంటే ?, అత్తను చూసి ఆవేశంలో అల్లుడు ఏం చేశాడంటే ?, క్లోజ్ !
అల్లుడు అత్తను హత్య చేసిన ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా కొడుగేనహళ్లిలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తను అల్లుడు హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అస్విత్ ఉన్నీసా (58) అనే మహిళ హత్యకు గురైందని పోలీసులు తెలిపారు. కొడిగెనహళ్లి పోలీస్ స్టేషన్‌లో అల్లుడి మీద కేసు నమోదైంది.
మృతుడు అశ్విత్ ఉన్నిసా కూతురు అత్తర్ ఉన్నీసా తన భర్త సయ్యద్ తో గొడవపడింది తరువాత ఆమె ఎప్పటిలాగే ఆమె తల్లికి ఫోన్ చేసింది. తుమకూరు తాలూకాలోని బెల్గుంబకు చెందిన అశ్విత్ ఉన్నీసా తన అల్లుడు సయ్యద్ ఇంటికి వెళ్లాలని అనుకుంది. కుమార్తె ఫోన్ చేయడంతో ఆందోళన చెందిన అశ్విత్ ఉన్నిసా సంఘటనా స్థలానికి వెళ్లడంతో ఆమె అల్లుడు సయ్యద్ చేతిలో హత్యకు గురైయ్యిందని పోలీసులు తెలిపారు.

అత్త అశ్విత్ ఉన్నిసా వచ్చేసరికి అల్లుడు సయ్యద్ ఆమె కూతురు అత్తర్ ఉన్నిసాతో గొడవ పడుతుండటం చూసిన అశ్విత్ ఉన్నిసా ఆందోళన చెందింది. అల్లుడు సయ్యద్, కూతురు అత్తర్ ఉన్నిసా మధ్య గొడవ జరగడంతో అత్త అశ్విత్ ఉన్నిసా జోక్యం చేసుకోవడంతో కోపోద్రిక్తుడైన అల్లుడు సయ్యద్ సుహైల్ అలియాస్ సయ్యద్ కర్రతో అతని అత్త మీద దాడి చేశాడు.
అల్లుడు సయ్యద్ కర్రతో దాడి చేయడంతో అశ్విత్ ఉన్నీసా కుప్పకూలిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో రక్తం ఎక్కువ పోవడంతో అశ్విత్ ఉన్నిసా గట్టిగా కేకలు వేసింది. తీవ్రగాయాలైన ఆమెను మధుగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించక అశ్విత్ ఉన్నీసా చనిపోయిందని పోలీసులు చెప్పారు. తన భార్యతో గొడవ జరిగిన ప్రతిసారి తన అత్త అశ్విత్ జోక్యం చేసుకుని తనను బూతులు తిట్టేదని, మా మధ్యలో నువ్వు జోక్యం చేసుకోకూడదని తానుపదేపదే చెప్పినా ఆమె పట్టించుకోలేదని, అందుకే చంపేశానని సయ్యద్ నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications